తుక్కు రేగ్గొట్టిన మరదలు: నడివీధిలో చొక్కా పట్టి.. దెబ్బకు దిమ్మ తిరిగింది..

Subscribe to Oneindia Telugu

మీరట్: బావ అని ఓపిక పడుతున్న కొద్ది.. చేష్టలు కాస్త శృతిమించుతుండటంతో.. ఓ యువతి అతని తుక్కు రేగ్గొట్టింది. నలుగురిలోకి లాక్కొచ్చి మరీ.. బుద్దొచ్చేలా అందరి ముందు చెంపలు వాయించింది. మరదలు తిరగబడటంతో.. నడివీధిలో పరువు పోగొట్టుకున్న సదరు బావ గారు.. ఏమి తెలియని అమాయకుడిలా మొహం పెట్టారు.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హద్దులు దాటిన ఓ బావ మరదలిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో ఓపిక నశించిన మరదలు.. బావ భరతం పట్టింది. నడివీధిలోకి ఈడ్చుకొచ్చి అందరూ చూస్తుండగా.. అతగాడి బాగోతాన్ని బట్టబయలు చేసింది. తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడంటూ.. ప్రతిఘటించే క్రమంలో తనకైన గాయాలను చూపించింది.

Sister in law attack on brother in law in meerut

మరదలు ఇంతలా తిరగబడుతుందని తెలియని సదరు బావ గారు.. ఈ చర్యకు షాక్ తిన్నాడు. నడివీధిలో మరదలు తనను కొడుతుంటే.. బేల చూపులు చూస్తూ.. ఏమి తెలియనివాడిలా కూర్చుండిపోయాడు. ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A sister-in-law was attacked her brother-in-law for harassing sexually. Incident took place in Meerut, Uttarpradesh
Please Wait while comments are loading...