వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు భారతీయుల్లా లేరు..ఆ దేశస్తుల్లా ఉన్నారు: పాస్‌పోర్ట్‌ను రిజెక్ట్ చేసిన అధికారులు

|
Google Oneindia TeluguNews

హర్యానా: ఓవైపు దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై పెద్ద ఎత్తున ఆందోళనలు, ఎన్‌ఆర్‌సీపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న క్రమంలో తాము భారతీయులమని రుజువు చేసుకోవాలని చెబుతూ ఇద్దరు అక్కా చెల్లెళ్లకు పాస్‌పోర్ట్ జారీ చేసేందుకు తిరస్కరించారు పాస్‌పోర్ట్ అధికారులు. ఈ ఘటన హర్యానాలో జరిగింది.

భారత్‌లోఉండి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ తాము నేపాలీ యువతుల్లా కనిపిస్తున్నామని తమకు పాస్‌పోర్టును తిరస్కరించారని హర్యానాకు చెందిన అక్కాచెల్లెళ్లు తమ గోడును వెల్లబోసుకున్నారు. పాస్‌పోర్టు కోసం చండీగఢ్‌లోని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లగా తాము భారతీయులమని రుజువు చేసుకోవాల్సిందిగా అధికారులు చెబుతూ తమ పాస్‌పోర్టును తిరస్కరించారని ఆ అక్కా చెల్లెళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మంత్రి అనిల్ విజ్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆ తర్వాతే పాస్‌పోర్టు ప్రక్రియ ప్రారంభమైందని అక్కా చెల్లెళ్లు చెప్పారు.

Sisters denied Passport by authorities citing they look like Nepalis

తండ్రితో పాటు సంతోష్ మరియు హెన్నాలు చండీగఢ్‌లోని పాస్‌పోర్టు కార్యాలయంకు వెళ్లారు. అక్కడ వారి డాక్యుమెంట్లను పరిశీలించిన పాస్‌పోర్టు అధికారి అన్నీ కరెక్టుగానే ఉన్నాయని అయితే అక్క చెల్లెళ్లు నేపాలీ నుంచి వచ్చిన వారిలా ఉన్నారని చెబుతూ వారి పాస్‌పోర్టు డాక్యుమెంట్స్‌పై తిరస్కరిస్తున్నట్లు రాసి ముందుగా తాము భారతీయులమని రుజువు చేసుకోవాలని చెప్పారు. అంతేకాదు దరఖాస్తు చేసుకున్న అక్కా చెల్లెళ్లు నేపాల్ నుంచి వచ్చిన వారిలా ఉన్నారని డాక్యుమెంట్స్ పై రాశారని అంబాలా డిప్యూటీ కమిషనర్ అశోక్ శర్మ చెప్పారు.

అమ్మాయిలు నేపాల్‌కు చెందినవారని చెబుతూ డాక్యుమెంట్లపై అలా రాశారని తన దృష్టికి రాగానే సుమోటోగా తీసుకున్నట్లు అంబాలా డిప్యూటీ కమిషనర్ అశోక్ శర్మ చెప్పారు. తాను జోక్యం చేసుకున్న తర్వాతే పాస్‌పోర్టు జారీ చేసేందుకు అధికారులు అంగీకరించారని అశోక్ శర్మ చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు అశోక్ శర్మ .

English summary
Narrating her ordeal, a girl said here on Wednesday that she and her sister were denied a passport by the concerned authorities citing that they look like Nepali
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X