పారిపోయి పెళ్లి చేసుకున్న అక్కాచెల్లెళ్లు.. ఏంటీ దరిద్రం!

ప్రస్తుత సమాజంలో వింత వింత పోకడలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు? అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా అటువంటి సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఒక యువతిని వెతుకుతున్న ఓ కుటుంబం ఆ యువతి చేసిన పనితో ఖంగు తింది.

ఇంటి నుండి వెళ్ళిపోయిన యువతి షాకింగ్ పని
ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి తన సోదరి వరుసైన మరో యువతిని వివాహం చేసుకొని, ఇకపై తాము భార్యాభర్తలుగా బ్రతకాలి అనుకుంటున్నామని చెప్పడంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. ఇక ఈ సంఘటన వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కు చెందిన ఒక యువతి ఇంటి నుండి వెళ్ళిపోయింది.

Sisters who flee away and got married A shocking incident in uttarpradesh

Take a Poll

తల్లిదండ్రుల వద్దకు రావటానికి ఆసక్తి చూపని యువతి
అయితే యువతిని ఎవరైనా విక్రయించి ఉంటారన్న అనుమానంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకొని యువతి కోసం వెతుకుతున్న పోలీసులకు ఆమె ఆచూకీ దొరికింది. అయితే ఆ యువతి మళ్లీ తిరిగి తల్లిదండ్రుల వద్దకు రావడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో ఆ యువతికి పోలీసులు భద్రత కల్పిస్తామని చెప్పగా ఇటీవల పోలీస్ స్టేషన్ కు వచ్చింది.

సోదరిని పెళ్లి చేసుకున్న యువతి
వరుసకు సోదరి అయిన మరో అమ్మాయితో కలిసి పెళ్లి బట్టల్లో పోలీస్ స్టేషన్ కు వచ్చిన యువతిని చూసి అందరూ ఒక్కసారిగా ఖంగు తిన్నారు. తాము ఇద్దరం ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నాము అని, ఇకపై ఇద్దరం భార్యాభర్తల్లాగా జీవిస్తాం అని వారు పోలీసులు ముందు చెప్పారు. తాను వరుడిగా మారి తన సోదరిని పెళ్లి చేసుకున్నానని సదరు యువతి పోలీసుల ముందు వెల్లడించింది.

ఏడాదిగా ప్రేమ, ఆపై పెళ్లి చేసుకున్న అక్కా చెల్లెళ్ళు
తాము ఏడాదిగా ప్రేమించుకుంటున్నామని, తమ కుటుంబ సభ్యులకు ఈ విషయం అర్థం కాదని, వారి తమ ప్రేమను వ్యతిరేకించడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నామని వారు పోలీసులకు చెప్పారు. అయితే వారిద్దరిని తిరిగి ఇంటికి వెళ్లాలని పోలీసులు సూచించినప్పటికీ వారు ఇరువురు ససేమిరా అన్నారు. ఇరువురు తమ మనసు మార్చుకోవడానికి నిరాకరించారు. ఇంటికి వెళితే తమను కలిసి ఉండనివ్వరని, ఇద్దరం విడిగా ఉండలేమని, కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+