భూమి గొడవ: మైసూరులో పట్టపగలు స్థలం యజమానిని కొడవళ్లతో నరికి చంపిన మహిళలు !

మైసూరు నగరంలో దారుణం జరిగింది. తాను కొనుగోలు చేసిన భూమిలో ఉన్న చెట్లు తొలగించడానికి వెళ్లిన యజమానిని అక్కడే చిన్న షెడ్ లో నివాసం ఉంటున్న ఇద్దరు మహిళలు ఈ భూమి మాదే అని గొడవ .

బెంగళూరు: మైసూరు నగరంలో దారుణం జరిగింది. తాను కొనుగోలు చేసిన భూమిలో ఉన్న చెట్లు తొలగించడానికి వెళ్లిన యజమానిని అక్కడే చిన్న షెడ్ లో నివాసం ఉంటున్న ఇద్దరు మహిళలు ఈ భూమి మాదే అని గొడవ పెట్టుకుని కొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు.

మైసూరు నగరంలోని బోగాది ప్రాంతంలో లోకేష్ (47) నివాసం ఉంటున్నాడు. ఈయన తన సోదరుడితో కలిసి బోగాది రింగ్ రోడ్డులో 9 గుంటల ఇంటి స్థలం ఇటీవలే కొనుగోలు చేశాడు. 9 గుంటల స్థలం యజమాని ఆ భూమి కబ్జాకాకుండా చూసుకోవడానికి ఓ కుటుంబ సభ్యులకు ఆ స్థలంలో చిన్న షెడ్ కట్టించి చూసుకోమని కొన్ని ఏళ్ల క్రితం చెప్పాడు.

Site matter a man murder at Mysuru city in Karnatak.

ఆ కుటుంబ సభ్యుల్లో శివమ్మ, శోభా అనే ఇద్దరు మహిళలు ఉన్నారు. కొంత కాలం తరువాత శోభా, శివమ్మ కుటుంబ సభ్యులు ఈ స్థలం మాదే అని యజమాని మీద ఎదురుతిరిగారు. ఆ స్థలం యజమాని గుట్టుచప్పుడు కాకుండా లోకేస్, అతని సోదరుడికి 9 గంటల స్థలం విక్రయించాడు.

సెప్టెంబర్ 1వ తేదీ శుక్రవారం లోకేష్ తాము కొనుగోలు చేసిన భూమిలో ఉన్న చెట్లు తొలగించడానికి అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో శివమ్మ, శోభా ఈ భూమి మాదే అంటు లోకేష్ తో గొడవ పెట్టుకున్నారు. మాటామాట పెరగడంతో ముందుగానే వెంట తెచ్చుకున్న కొడవళ్లతో లోకేష్ మీద దాడి చెయ్యడంతో ఆయన సంఘటనా స్థలంలొ మరణించాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+