టెక్కీలకు షాక్: ఆ 6 కంపెనీల్లో 4,157 మంది తొలగింపు, కొత్త ఉద్యోగాల్లేవు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల కారణంగా కొత్తగా రిక్రూట్‌మెంట్లు లేకుండా పోయాయి. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొనేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.ఇండియాకు చెందిన ఆరు టెక్ కంపెనీల్లో ఆరు మాసాల కాలంలో సుమారు 4,157 మందిని తొలగించారు.

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న పరిణామాలు ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు పింక్‌స్లిప్‌లు అందుకోవాల్సి వస్తోందోననే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.

అమెరికాలో చోటుచేసుకొన్న పరిణామాలు ఇండియాకు చెందిన ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు ఇండియన్ టెక్ ఉద్యోగులపై ప్రభావం చూపుతున్నాయి.

స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా ట్రంప్ తీసుకొన్న నిర్ణయం ఇండియా టెక్ కంపెనీలపై, ఉద్యోగులపై కన్పిస్తోంది. టెక్ ఉద్యోగులు ఇండియాలో ట్రేడ్ యూనియన్లు కూడ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడ నెలకొన్నాయి.

 ఉద్యోగులను తగ్గిస్తున్న టెక్ కంపెనీలు

ఉద్యోగులను తగ్గిస్తున్న టెక్ కంపెనీలు

156 బిలియన్‌ డాలర్ల ఐటీ ఇండస్ట్రి పరిస్థితులు ఇంకా మారడం లేదు. ఉద్యోగాల సృష్టికి అతిపెద్ద పరిశ్రమగా ఉండే ఈ ఐటీ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.కొత్త నియామకాలు లేకపోవడం, పాత ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి కంపెనీలు. ప్రస్తుతం టాప్‌ టెక్‌ దిగ్గజాలన్నీ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేసుకున్నాయి.

 భారీగా తగ్గిన ఉద్యోగులు

భారీగా తగ్గిన ఉద్యోగులు

ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహింద్రా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను బాగా తగ్గించాయని నివేదికలు చెబుతున్నాయి.కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖయ సంఖ్య గణనీయంగా పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. టాప్‌-6 ఐటీ కంపెనీల్లో కేవలం టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మాత్రమే తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్నాయి.

 ఆ కంపెనీల్లో 4,157 ఉద్యోగులపై వేటు

ఆ కంపెనీల్లో 4,157 ఉద్యోగులపై వేటు

ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఆరు టెక్‌ కంపెనీల ఉద్యోగుల సంఖ్యలో 4,157 మంది తగ్గిపోయారు. గతేడాది ఇదే సమయంలో ఈ కంపెనీల్లో 60వేల మేర ఉద్యోగాలు పెరిగితే, ఈ ఏడాది మాత్రం 4,157 మేర ఉద్యోగాలపై వేటు పడింది. కేవలం నియామకాలు పడిపోవడమే కాకుండా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం చూస్తున్నామని ఐటీ కన్సల్టింగ్‌ సంస్థ హెచ్‌ఎఫ్‌సీ రీసెర్చ్ తెలిపింది.

 ఐటీ ఇండస్ట్రీకి సవాళ్ళు

ఐటీ ఇండస్ట్రీకి సవాళ్ళు

డిజిటలైజేషన్‌, ఆటోమేషన్‌ అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ కొన్ని సవాళ్లను కూడా ఐటీ ఇండస్ట్రి ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్పారు.. ఆటోమేషన్‌ ప్రభావంతో రెడండెంట్‌గా ఉన్న వేల కొద్దీ ఎంట్రీ-లెవల్‌ ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి.. అధిక వినియోగం, ఉత్పాదకత మెరుగుదలతో తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించామని ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ ఎండీ రంగనాథ్‌ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The $156-billion Indian IT industry, often called the biggest job creator in the organised sector, is seeing a tectonic shift in recruitment.For the first six months of the fiscal, Cognizant, Infosys, Wipro and Tech Mahindra have all seen their employee strength actually decline — quite sharply in Cognizant's case (by over 5,000).

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి