కూలింగ్ పీరియడ్?: హిందూ వివాహ చట్టంపై సుప్రీం కీలక తీర్పు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: హిందూ వివాహ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూ వివాహచట్టం కింద విడాకులు మంజూరు చేయడానికి ముందు తప్పనిసరిగా ఆరునెలల రాజీ గడువును పాటించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

దంపతులకు ఒకే ఇంటిలో నివసించే ఉద్దేశం లేకపోతే ఆ గడువును ట్రయల్ కోర్టు రద్దు చేయవచ్చని తెలిపింది. విడాకుల దరఖాస్తు తొలి, తుది విచారణకు మధ్య ఆరునెలల గడువు(కూలింగ్ పీరియడ్) ఉండాలని హిందూ వివాహచట్టం సూచిస్తోంది. విడిపోయే దంపతుల మధ్య రాజీకి చివరి అవకాశంగా ఈ నిబంధనను చేర్చారు.

 Six-month 'cooling period' for divorce under Hindu law not mandatory, says Supreme Court

కాగా, చట్టంలోని 13బీ(2) నిబంధన తప్పనిసరికాదని, కోర్టు ఆదేశాలకు అది లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎనిమిదేండ్లుగా విడివిడిగా జీవిస్తున్న తమకు ఆరు నెలల సర్దుబాటు గడువు అవసరం లేదని ఓ జంట దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court on Tuesday held that the minimum cooling period of six months for granting the decree of divorce under the Hindu law can be waived by a trial court if there was no possibility of cohabitation between an estranged couple.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి