విషాదం.. నదిలో కొట్టుకుపోయి ఆరుగురు మృత్యువాత, వారంతా ఓకే ఫ్యామిలీ..
పుణ్య స్నానం ఆచరించేందుకు వచ్చిన ఆ ఫ్యామిలీ విషాదం చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురు నదిలో కొట్టుకుపోయి.. చనిపోయారు. మరో ముగ్గురిని రక్షించగా.. మరో ముగ్గురి గల్లంతయ్యారు. ఆగ్రా నుంచి అయోధ్య సందర్శనకు ఓ కుటుంబం వచ్చింది. ఫ్యామిలీ మొత్తం 15 మంది సభ్యులు కాగా.. స్నానం చేయడానికి నది వద్దకు 12 మంది వచ్చారు. నది ప్రవహించడం.. ఘాట్ వద్దకు నీరు ఎక్కువగా రావడంతో ఒక్కొక్కరు నదిలో పడిపోయారు.
స్నానం చేయడానికి సరయూ నది వద్ద గల గుప్తర్ ఘాట్‌కు వచ్చారు. కుటుంబంలోని కొందరు కాళ్లు కడుక్కోగా.. మరికొందరు స్నానం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహ వేగం పెరగడంతో కొట్టుకుపోయారు. గమనించిన మిగిలిన కుటుంబీకులు వారికి సాయం చేసేందుకు యత్నించారు. అయితే వారు కూడా నీట మునిగారు. ముగినిపోయిన వారిలో మహిళలు,చిన్నారులు కూడా ఉన్నారు.

Recommended Video
ఇప్పటి వరకు 9 మందిని బయటకు తీశామని.. వారిలో ఆరుగురు చనిపోయారని, మరో ముగ్గురిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనుజ్‌కుమార్ తెలిపారు. గజ ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రక్షించిన ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications