వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లకు ఆరేళ్లు, రక్షణ ఒప్పందాలు కాంగ్రెస్‌కు ఏటిఎంలు : మోదీ

|
Google Oneindia TeluguNews

ప్రస్థుతం జరుగుతున్న ఎన్నికలు రక్షణశాఖ, భద్రతాదళాలు చుట్టు తిరుగుతున్నాయి. ముఖ్యంగా బాలకోట్ ఉదంతం జరిగిన తర్వాత జాతీయ వాదం పేరుతో బీజేపీ విపరీతంగా ప్రచారం చేస్తోంది. దీంతో ఎన్నికలు మొత్తం అటు భద్రత, రక్షణ చుట్టే తిరుగుతున్నాయి. ఈనేపథ్యంలోనే రక్షణ శాఖ ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలుగా మారాయని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ బహిరంగా సభలో అన్నారు.

భద్రతా దళాలకు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల కోసం ఆరేళ్లు

భద్రతా దళాలకు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల కోసం ఆరేళ్లు

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రక్షణ శాఖ ఒప్పందాలు ఆలస్యం కావాడంపై నరేంద్ర మోడీ ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి రక్షణ శాఖ ఒప్పందాలు డబ్బును అందించే ఏటిఎంలుగా తయారయ్యాయని ఆయన ఆరోపణలు చేశారు. ఈనేపథ్యంలోనే భద్రతా దళాలకు కనీసం బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు అందించడానికి కూడ కాంగ్రెస్ పార్టీకి సుమారు ఆరు సంవత్సరాలు పట్టాయని విమర్శించారు.

 70 శాతం రక్షణ అవసరాలు దిగుమతుల ద్వారనే

70 శాతం రక్షణ అవసరాలు దిగుమతుల ద్వారనే


భారతదేశ రక్షణ అవసరాల కోసం 70 శాతం మేర ఇతర దేశాల నుండి దిగుమతుల ద్వారనే జరుగుతున్నాయని తెలిపారు. కాగా ఈ రక్షణ శాఖ ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీ ఏటింలుగా మారాయాని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ స్నేహితులు వీటీ అమలుకు ఆలస్యం చేశాయని అన్నారు. దాని వల్ల భారతదేశ ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు.

వారసుల తప్పులను అంగీకరించరా..

వారసుల తప్పులను అంగీకరించరా..


ఈనేపథ్యంలోనే తమ వారసుల పేరు మీద ఓట్లు అడుగుతున్న పార్టీ ,వాళ్లు చేసిన తప్పులను మాత్రం జరిగిందేదో జరిగిపోయిందంటూ కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఇంచార్జ్ శ్యాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. ఇక బీజేపీ ప్రధానమంత్రి వాజ్‌పేయి హయంలో జరిగిన ఆభివృద్దిని కొనసాగించకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని అన్నారు.

English summary
Addressing his second election rally today in the Solan constituency of Himachal Pradesh, Prime Minister Narendra Modi attacked the Congress’ endemic corruption and political nepotism which significantly hampered the nation’s progress and asserted that the Opposition’s election agenda rested upon personal abuses while the BJP’s election agenda was about making India stronger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X