14 ఏళ్ల మూగ,చెవిటి బాలికపై ఆరుగురు గ్యాంగ్ రేప్... నిందితుల్లో నలుగురు మైనర్ బాలురు...
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది.14 ఏళ్ల ఓ మూగ,చెవిటి బాలికపై ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అక్కడితో ఆగక... అత్యాచార సమయంలో తీసిన ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. నిందితుల్లో నలుగురు మైనర్ బాలురు ఉన్నారు. షాదోల్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం రేకెత్తిస్తోంది.
అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీసీ సాగర్ ఈ ఘటనపై మాట్లాడుతూ... గురువారం(సెప్టెంబర్ 30) సాయంత్రం ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. గత శనివారం ఆ బాలిక తన ఇంటి బయట నిలబడ్డ సమయంలో... చుట్టుపక్కల ఉండే కొందరు వ్యక్తులు మాయ మాటలతో ఆమెను తమ వెంట తీసుకెళ్లారని చెప్పారు. నిర్మానుష్య ప్రదేశంలోని ఓ గుడిసెలోకి బాలికను తీసుకెళ్లి... స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం జరిపారని తెలిపారు.

ఈ ఘటనలో మొత్తం ఆరుగురు వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. ఆ సమయంలో తమ సెల్‌ఫోన్లలో ఫోటోలు,వీడియోలు చిత్రీకరించి... ఆపై వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు తెలిపారు.గ్రామానికి చెందిన ఓ యువకుడు బాధితురాలి తండ్రికి... ఆ ఫోటోలను చూపించడంతో అతను షాక్ తిన్నాడని చెప్పారు.ఇంటికెళ్లి కుమార్తెను ఆరా తీయగా... ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అసలు విషయం బయటపెట్టిందన్నారు.వెంటనే గ్రామ పెద్దలకు ఈ విషయాన్ని తెలియజేసిన ఆమె తండ్రి... ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్దారణ అయింది. బాధిత బాలిక మూగ,చెవిటి కావడంతో ఆమె వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు సైగల భాష తెలిసిన నిపుణుడిని రప్పించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఏడీజీపీ తెలిపారు.బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు.
మైనర్ బాలికలపై అత్యాచారాల్లో టాప్‌లో మధ్యప్రదేశ్..
Recommended Video
నేషనల్ క్రైమ్ బ్యూరో 2020 లెక్కల ప్రకారం... మహిళలపై నేరాల్లో ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,ఢిల్లీ,రాజస్తాన్,టాప్‌లో ఉన్నాయి. వరుసగా రెండో ఏడాది రాజస్తాన్ టాప్ లిస్టులో చేరింది. గతేడాది రాజస్తాన్‌లో 34,535,ఉత్తరప్రదేశ్‌లో 49,385,పశ్చిమ బెంగాల్‌లో 36,439 కేసులు నమోదయ్యాయి. అత్యాచార కేసుల్లో రాజస్తాన్ 5310 కేసులతో టాప్‌లో ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో 2769 కేసులతో ఉత్తరప్రదేశ్ ఉంది.మైనర్ బాలికలపై అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ టాప్‌లో ఉంది.గతేడాది మధ్యప్రదేశ్‌లో 3259 మంది మైనర్ బాలికలు అత్యాచారాలకు గురైనట్లుగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2785,ఉత్తరప్రదేశ్‌లో 2630 కేసులు నమోదయ్యాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యధికంగా ఢిల్లీలో గతేడాది 967 కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాతి స్థానంలో 409 కేసులతో రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరం ఉన్నది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications