పేపర్ కట్టర్‌తో మనిషి ముఖం చెక్కేశారు
ముంబై: మద్యం మత్తులో వెళుతున్న ముగ్గురు నడి రోడ్డు మీద ఒకరి పై పేపర్ కట్టర్ తో దాడి చేసిన సంఘటన ముంబై నగరంలో జరిగింది. తీవ్రగాయాలైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. పోలీసులు ముగ్గురి మీద కేసు నమోదు చేశారు.
ఇర్విన్ కార్డొజ్ (29) అనే యువకుడు ముంబై లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ట్రేడ్ కమర్షియల్ స్పెషలిస్ట్ గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఇతను జిమ్ లో వ్యాయామం పూర్తి చేసుకుని బైక్ లో ఇంటికి బయలుదేరాడు.
మార్గం మధ్యలో మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని చర్చి సమీపంలో వెళుతున్న సమయంలో కారులో వెళుతున్న ముగ్గురు ఇతని మీద పేపర్ కట్టర్ తో దాడి చేశారు. ముఖం, మెడ చీల్చేశారు. తరువాత దాడి చెయ్యడానికి ప్రయత్నించారు.

తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఇర్విన్ తల్లి సహాయంతో ఆసుపత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి చేరుకుని ఇర్విన్ నుండి కారు నెంబర్ తో పాటు పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
పేపర్ కట్టర్ తో దాడి చేసిన కాలేజ్ విద్యార్థిని మిహిక వాడొన్ (21), ఆమె స్నేహితుడు సిద్దార్థ్ యాదవ్ (21) అనే ఇద్దరిని అరెస్టు చేశారు. ఇదే కేసులో ఇంకో నిందితుడి కోసం గాలిస్తున్నామని, మద్యం మత్తులో వీరు ఇర్విన్ మీద దాడి చేశారని పోలీసులు అన్నారు. తన మీద అనవసరంగా దాడి చేశారని ఇర్విన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications