వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బానిసత్వం ఇక చరిత్రే: కర్తవ్య పథ్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నూతనంగా నామకరణం చేసిన 'కర్తవ్య పథ్' - రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఎర్ర గ్రానైట్ నడక మార్గాలు, పునరుద్ధరింపబడిన కాలువలు, కొత్త సౌకర్యాల బ్లాక్‌లు, వెండింగ్ కియోస్క్‌లు, రాష్ట్రాల వారీగా ఫుడ్ స్టాల్స్‌ను గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాటలో నడిచుంటే..: ప్రధాని మోడీ

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన బాటలో భారతదేశం మొదట్నుంచి పయనించి ఉంటే.. భారతదేశం కొత్త శిఖరాలకు చేరుకుని ఉండేందన్నారు. బ్రిటీష్ రాజ్యంలో 'బానిసత్వానికి' చరిత్ర ప్రతీకగా నిలిచిన రాజ్‌పథ్‌ను ఇప్పుడు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పేరు మార్చడం వల్ల దేశానికి కొత్త శక్తి, స్ఫూర్తి లభించిందని ప్రధాని మోడీ అన్నారు.

బానిసత్వం శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయిందంటూ మోడీ

బానిసత్వానికి చిహ్నమైన కింగ్స్‌వే లేదా రాజ్‌పథ్ ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయిందని, శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయిందని ప్రధాని మోడీ అన్నారు. 'భారతదేశం సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గాన్ని అనుసరించినట్లయితే, దేశం కొత్త శిఖరానికి చేరుకునేది; పాపం ఆయనను మరచిపోయారు' అని ప్రధాని అన్నారు. ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం ఇప్పుడు మనకు స్ఫూర్తినిస్తుందని, మార్గదర్శకంగా నిలుస్తుందని మోడీ అన్నారు.

జనవరి 26కు వారే ముఖ్య అతిథులంటూ ప్రధాని మోడీ

మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పునరుద్ధరణ జరిగింది. గత ఎనిమిదేళ్లలో నేతాజీ ఆశయాలు, కలల ముద్రలు వేసిన అనేక నిర్ణయాలు తీసుకున్నామని మోడీ చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన మార్పులు కేవలం చిహ్నాలకే పరిమితం కాకుండా ఇప్పుడు విధానాల్లో భాగమయ్యాయని అన్నారు. కర్తవ్య పథం అభివృద్ధిలో పాలుపంచుకున్న కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారు దానిని నిర్మించడమే కాకుండా ఇతరులకు 'కర్తవ్య' (కర్తవ్యం) మార్గాన్ని చూపారని అన్నారు. అంతేగాక, జనవరి 26కు కార్మికులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఇండియా గేట్ వద్ద స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆవిష్కరించారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది ప్రారంభంలో పరాక్రమ్ దివాస్ (జనవరి 23) నాడు ప్రధాని మోడీ నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రదేశంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
నేతాజీ గొప్ప విగ్రహం 280 మెట్రిక్ టన్నుల బరువున్న ఏకశిలా గ్రానైట్ బ్లాక్ నుంచి చెక్కబడింది. నేతాజీ విగ్రహావిష్కరణ సందర్భంగా ఐఎన్‌ఏ సంప్రదాయ పాట ' కదమ్ కదమ్ బధయే జా ' ట్యూన్‌తో పాటు సాగింది.
కొత్తగా నామకరణం చేయబడిన కర్తవ్య మార్గంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేతాజీ సేవలను తరతరాలకు చాటేందుకు ఇండియా గేట్ వద్ద 28 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేతాజీ విగ్రహానికి ఖమ్మం జిల్లా గ్రానైట్ వినియోగించారు. ప్రఖ్యాత కళాకారుడు అరుణ్ యోగిరాజ్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని రూపకల్పన చేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉంది. చుట్టూ పచ్చదనంతో కూడిన ఎరుపు గ్రానైట్ నడక మార్గాలు, పునరుద్ధరించిన కాలువలు, రాష్ట్రాల వారీగా ఫుడ్ స్టాల్స్, కొత్త సౌకర్యాల బ్లాక్‌లు, వెండింగ్ కియోస్క్‌లు ఈ స్ట్రెచ్‌లో ఉన్నాయి. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రారంభోత్సవానికి ముందు నేతాజీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.

English summary
slavery symbol, Rajpath now consigned to history: PM Modi inaugurates 'Kartavya Path'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X