ఉత్తరప్రదేశ్ బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ,రాహుల్ దిగ్భ్రాంతి
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా బస్సు మొత్తం వ్యాపించడంతో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో బయటపడినట్టు సమాచారం. శుక్రవారం రాత్రి లక్నోకి 163 కి.మీ దూరంలోని చిబ్రమౌ సమీపంలోని జీటీ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
జైపూర్ నుండి ఫరూఖాబాద్ వెళ్తున్న ఆ బస్సులో ప్రమాద సమయంలో సిబ్బందితో సహా మొత్తం 45 మంది ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మంటల్లో కాలిపోయిన 10 మృతదేహాలను ఫోరెన్సిక్ టీమ్స్ స్వాధీనం చేసుకున్నాయని, మిగతా మృతదేహాలను బయటకు తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ తెలిపారు. గాయపడ్డ 21 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడినట్టు వెల్లడించారు.

బస్సు ట్రక్కును ఢీకొట్టిన తర్వాత డీజిల్ ట్యాంకులో పేలుడు సంభవించడంతో బస్సులో మంటలు చెలరేగినట్టు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు ఉండవచ్చునని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ప్రమాదంలో చనిపోయినవారికి సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ మృతులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ ద్వారా మృతులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అన్నారు. కాగా,ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
कन्नौज में सड़क हादसे में बस और ट्रक के टक्कर में लगी भीषण आग से 20 लोगों की मौत और अनेक लोगों के घायल होने की खबर से आहत हूं ।
— Rahul Gandhi (@RahulGandhi) January 11, 2020
मृतकों के परिवार के प्रति मैं अपनी गहरी संवेदना व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं।
उत्तर प्रदेश के कन्नौज में हुए भीषण सड़क हादसे के बारे में जानकर अत्यंत दुख पहुंचा है। इस दुर्घटना में कई लोगों को अपनी जान गंवानी पड़ी है। मैं मृतकों के परिजनों के प्रति अपनी संवेदनाएं प्रकट करता हूं, साथ ही घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) January 11, 2020












Click it and Unblock the Notifications