కొత్త రూల్: రైలులో ఎక్కువ సేపు పడుకోవడం కుదరదు

న్యూఢిల్లీ: రైల్వేశాఖ కొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చింది. రైళ్ళలో చిల్లర జగడాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటోంది. బెర్తుల్లో నిద్రపోయే వేళలను కుదించింది.

రిజర్వుడ్ బోగీల్లో క్రింది, మధ్య బెర్త్‌ల ప్రయాణికులు త్వరగా పడుకోవడం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటోందని, ఈ విధంగా ఎక్కువసేపు నిద్ర పోవడాన్ని నిరోధించాలని నిర్ణయించింది.

రైల్వే బోర్డు గత నెల 31న విడుదల చేసిన ఓ సర్క్యులర్ ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో మాత్రమే బెర్తుల్లో పడుకోవచ్చురాత్రి 10 గంటల కన్నా ముందు, ఉదయం ఆరు గంటల తర్వాత సీట్లలో ఇతరులు కూర్చోవడానికి అవకాశం ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Sleeping Time Cut By An Hour For Train Passengers In New Rule

అయితే గర్భిణులు, అనారోగ్యవంతులు, దివ్యాంగులు ఈ వేళల కన్నా ఎక్కువ సేపు నిద్రపోవాలనుకుంటే, వారికి ఇతర ప్రయాణికులు సహకరించాలని పేర్కొన్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం క్రింది, మధ్య బెర్తుల్లో ప్రయాణికులు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణికులు నిద్రపోయేందుకు అనుమతి ఉంది.

అయితే ఈ నిర్ణయం అమల్లో రైళ్ళలో ఏ రకమైన పరిస్థితి ఉంటుందోననే ఆందోళన కూడ లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+