వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేదు అనుభవం: బీహార్ సిఎం నితీష్‌పైకి స్లిప్పర్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఢిల్లీ పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. న్యూఢిల్లీలోని బెగుసరాయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు స్లిప్రర్స్ విసిరేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనకు నితీష్ కుమార్ దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఆ బూటు సిఎం నితీష్ కుమార్‌కు తగలకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

జనతా దళ్ యూనైటెడ్(జెడియూ) ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన సంకల్ప్ ర్యాలీలో నితీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడారు. మళ్లీ చీకటి రోజులు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ, ఆర్‌జెడి పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఒక్కటైతే శాంతి భద్రతలు లోపిస్తాయని ఆరోపించారు.

Nitish Kumar

2007లో అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎంతో కృషి చేసి బీహార్ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పి ఈ స్థాయికి తీసుకొచ్చానని ఆయన తెలిపారు. మళ్లీ కాంగ్రెస్, ఆర్‌జెడి పొత్తు పెట్టుకుని మళ్లీ చీకటి రోజులు తీసుకురావడానికి చూస్తున్నాయని ఆరోపించారు.

గడ్డి కుంభకోణంలో జైలుకు వెళ్లిన ఆర్‌జెడి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఏ విధంగా జైలు నుంచి విడుదలయ్యారో తెలుసని అన్నారు. గడ్డి కుంభకోణంలో అరెస్ట్ అయిన లాలూ, ఏదో స్వాతంత్ర్యోద్యమం చేసి అరెస్టయినట్లు భావిస్తున్నట్లుగా ఉందని నితీష్ విమర్శించారు.

English summary
Bihar Chief Minister Nitish Kumar was in for a shock when a shoe was hurled at him at a public function in Begusarai on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X