కమల్‌హసన్‌పై చెప్పు విసిరిన దుండగుడు
చెన్నై : తమిళనటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హసన్‌హై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విల్లుపురంలో నిర్వహించిన రోడ్ షో లో ఈ ఘటన జరిగింది. అయితే అది కమల్ హసన్‌కు తగలలేదు. మరికొంత మంది కూడా కమల్‌పై చెప్పులు విసిరేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెప్పు విసిరిన వ్యక్తితో పాటు దాడికి పాల్పడే ప్రయత్నం చేసిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాడికి ప్రయత్నించిన వారిలో బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమాన్ సేన సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హిందువే తొలి ఉగ్రవాదన్న కమల్ వ్యాఖ్యలకు నిరసనగానే వారు చెప్పులతో దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

హిందూ ఉగ్రవాది అంటూ రెండ్రోజుల క్రితం కమల్ హసన్ చేసిన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. స్వతంత్ర భారతావనిలో మొట్ట మొదటి ఉగ్రవాది హిందువని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని అన్నారు. కమల్ చేసిన కామెంట్లు పెను దుమారమే రేపాయి. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా పలుచోట్ల నిరసనల ప్రదర్శనలు నిర్వహించిన ఆందోళనకారులు కమల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమల్ వ్యాఖ్యలపై తమిళనాడు కరూర్ జిల్లాలకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి కేసు నమోదుచేశారు. హిందువులను టెర్రిరిస్టులంటూ కమల్ హసన్ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాల్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు 15ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.












Click it and Unblock the Notifications