వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేం వికాస్‌కు కేంద్రంలో కీలక బాధ్యతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీనియర్‌ దౌత్యవేత్త, స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ పుస్తక రచయిత వికాస్‌ స్వరూప్‌ను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ 1986 బ్యాచ్‌కు చెందిన వికాస్‌కు ఈ ఉత్తర్వులతో విదేశాంగ శాఖ సహ కార్యదర్శి నుంచి అదనపు కార్యదర్శి స్థానానికి పదోన్నతి కూడా లభించింది.

దీంతో పాటు అక్టోబర్‌లో జరగనున్న భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సుకు ముఖ్య సమన్వయకర్తగా నియమించబడ్డారు. వికాస్‌ స్వరూప్‌ రాసిన క్యూ అండ్‌ ఏ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిందింది. ఈ పుస్తకం ఆధారంగా రూపొందించిన స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రం 8 అకాడెమీ అవార్డులను గెలిచింది.

Slumdog fame Vikas Swarup to be MEA spokesman

ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఐరాస విభాగంలోని రాజకీయ వ్యవహారాల సంయుక్త కార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న సయ్యద్ అక్బరుద్దీన్‌కు అదనపు కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు.

English summary
He became famous as the author of 'Q&A,' the book that was made into the Oscar winning blockbuster 'Slumdog Millionaire.' And now, Vikas Swarup — a 1986 batch Indian Foreign Service officer — will continue to remain in the limelight in a new role -- as the next foreign ministry spokesperson.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X