క్యాబిన్‌లో పొగలు: వెనుదిరిగిన ఢిల్లీ-మిలాన్ విమానం
న్యూఢిల్లీ: టేకాఫ్ అయిన 40 నిమిషాలకే ప్రయాణికుల క్యాబిన్‌లో ఒక్కసారిగా పొగలు రావడంతో ఢిల్లీ - మిలాన్ విమానం అత్యవసరంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఢిల్లీ నుంచి మిలాన్(ఇటలీ)కి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 137 షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత ప్రయాణికుల క్యాబిన్ లో పొగలు వ్యాపించాయి.
పైలట్ వెంటనే ఈ సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ సిబ్బందికి తెలియజేశాడు. అంతే వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు అత్యవసరంగా వెనుదిరిగింది. ఈ ప్రమాద సంఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ కూడా సమాచారాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Air India flt 137 Delhi to Milan which departd at 1500 hours has reportd smoke inside the cabin.Full emergency landing back at IGI.
— CP Delhi (@CPDelhi) January 26, 2016 అయితే ఈ సంఘటనలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. ఆనంతరం కొన్ని గంటల్లోనే వేరొక విమానం ద్వానా ప్రయాణికులను మిలాన్ చేరవేస్తామని ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications