పని చూసి చెప్పండి: ఘాటుగా స్మృతి ఇరానీ రిప్లై

న్యూఢిల్లీ: తనపై వస్తున్న విమర్శలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఘాటుగా స్పందించారు. కాంగ్రెసు నేత అజయ్ మకెన్ విమర్శలకు ఆమె స్పందించారు. తన పని చూసి తీర్పు చెప్పాలని ఆమె ప్రజలను కోరారు.

మానవ వనరుల శాఖ మంత్రిగా నియమితులై స్మృతి గ్రాడ్యుయేట్ కూడా కారని మకెన్ వ్యాఖ్యానించారు. దానిపై ఆమె గురువారంనాడు స్పందించారు. పని నుంచి తన దృష్టిని మళ్లించడానికి అనవసరమైన పరిస్థితులు కల్పిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

Smriti Irani responds to Ajay Maken's comments, says 'judge me by my work'

మోడీ మంత్రివర్గం ఏమిటి, హెచ్ఆర్‌డి మంత్రి స్మృతి ఇరాన కనీసం గ్రాడ్యుయేట్ కూడా కారు, అఫిడవిట్ చూడండి అంటూ మకెన్ ట్వీట్ చేశాడు. దీంతో వివాదం ప్రారంభమైంది. మకెన్ వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇరానీ అండంగా నిలిచింది. యుపిఎ ప్రభుత్వానికి నేతృత్వం వహించడానికి సోనియా గాంధీ విద్యార్ఙతలేమిటని ప్రశ్నించింది.

స్మృతి ఇరానీపై మకెన్ వ్యాఖ్యలు కొంత మంది కాంగ్రెసు నాయకులు కూడా వ్యతిరేకించారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు సరి కాదని మనీష్ తివారీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+