రూ. 100 కోట్ల పాము విషం సీజ్: ఆరుగురి అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ్ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో రూ.100 కోట్లు విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకుని, ఆరుగురిని శనివారం అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
బైకుంతాపూర్ పరిధిలోని అటవీశాఖాధికారి సంజయ్‌దత్తా ఈ మేరకు వివరాలను తెలిపారు. అటవీ ప్రాంతంలో మోటార్ సైకిళ్లపై ప్రయాణిస్తున్న ఆరుగురిని తనిఖీ చేయగా వారి బ్యాగుల్లో రూ.100 కోట్లు(అంతర్జాతీయ మార్కెట్)లో విలువైన పాము విషాన్ని గుర్తించారు.

పాము విషాన్ని స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నట్లు సంజయ్ తెలిపారు. విదేశాల నుంచి తీసుకొచ్చిన ఈ పాము విషాన్ని భూటాన్‌కు తరలిస్తున్నట్లు అధికారులు విచారణలో తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications