తొలి మహిళగా రికార్డ్: లోకసభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలత
ఐఏఎస్ అధికారి స్నేహలత శ్రీవాత్సవను లోకసభ నూతన జనరల్ సెక్రటరీగా నియమిస్తూ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ పదవిలో నియమితులైన మొదటి మహిళగా స్నేహలత రికార్డుల్లోకెక్కారు.
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారి స్నేహలత శ్రీవాత్సవను లోకసభ నూతన జనరల్ సెక్రటరీగా నియమిస్తూ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ పదవిలో నియమితులైన మొదటి మహిళగా స్నేహలత రికార్డుల్లోకెక్కారు.
స్నేహలత డిసెంబర్ 1న బాధ్యతలు తీసుకుని, నవంబర్ 30, 2018 వరకు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం జనరల్ సెక్రటరీ వ్యవహారాలను చూస్తున్న అనూప్ మిశ్రా నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

1982 మధ్యప్రదేశ్ ఐఏఎస్ కేడర్‌కి చెందిన స్నేహలత.. గతంలో న్యాయ, ఆర్థిక మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. రాజ్యసభ మహిళా సెక్రటరీ జనరల్‌గా రమాదేవి ఇప్పటికే రికార్డుల్లోకి ఎక్కారు.












Click it and Unblock the Notifications