రేసర్ అశ్విన్ సుందర్ దంపతులు సజీవదహనం: వైరల్ వీడియో

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అంతర్జాతీయ కార్ల పోటీల్లో పాల్గొనే ఫార్ములా 4 రేసర్, అనేక దేశాల్లో జరిగిన పోటీల్లో చాంపియన్ గా నిలిచిన చెన్నైలోని అష్టలక్ష్మీ నగర్ కు చెందిన అశ్విన్ సుందర్ (27), ఆయన భార్య నివేదిత (26) సజీవదహనం అవుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

శుక్రవారం రాత్రి తన స్నేహితుడు ఈసీఆర్ రోడ్డులోని ఒక రిసార్టులో ఇచ్చిన పార్టీకి అశ్విన్ సుందర్ భార్య నివేదితతో కలిసి వెళ్లారు. అశ్విన్ సుందర్ కు రెండే సీట్లు ఉన్న బీఎండబ్ల్యూ కారు ఉంది. శనివారం వేకువ జామున 1.30 గంటలకు కారులో భార్యతో కలిసి ఇంటికి బయలుదేరారు.

మార్గం మద్యలో అంబేద్కర్ మణిమండపం సమీపంలోని మలుపు దగ్గర కారు అదుపుతప్పి చెట్టును డీకొని మంటలు వ్యాపించాయి. అదే సమయంలో అటువైపు వెళ్లిన మహిళా కానిస్టేబుల్ ఉషారాణి అనే ఆమె కారు దగ్గరకు వెళ్లలేక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

అటువైపు వెలుతున్న వారు అగ్నికిఆహుతి అవుతున్న కారును మొబైల్ లో చిత్రీకరించారు. అయితే అప్పటికి అక్కడ ఉన్న వారికి కారులో ఉన్నది అశ్విన్ సుందర్ అని తెలీదు. పోలీసుల విచారణలో అశ్విన్ సుందర్ దంపతులు సజీవదహనం అయ్యారని దృవీకరించడంతో తరువాత వారు తీసిని వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a tragic incident, professional car racer Ashwin Sundar and his wife Nivedhitha were charred to death after their BMW car rammed a roadside tree in Chennai. Social media was shocked and reacted in disbelief about the incident.
Please Wait while comments are loading...