రాత్రి పూట మద్యం సేవించి వచ్చి ఆడపిల్లలకు సెక్స్ పాఠాలు
బెంగళూరు: పిల్లలకు సెక్స్ పాఠాలు చెబుతూ వారిని ఇబ్బందులకు గురి చేసిన ఓ సంక్షేమాధికారి చిక్కుల్లో పడ్డారు. ఎనిమిది నుంచి పీయూసీ విద్యార్థినులకు సెక్స్ పాఠాలు చెబుతూ వారి పట్ల అసభ్యంగా ఓ సంక్షేమాధికారి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కర్ణాటక రాజధాని బెంగుళూరులోని రామనగర్ సాంఘిక సంక్షేమాధికారి నాగరాజప్ప హాస్టళ్లకు వెళుతూ సెక్స్ అంటే ఏమిటో తెలుసా? అంటూ ప్రశ్నించేవాడు.
అంతేకాకుండా కాకుండా వారికి ఆ విషయాల గురించి వివరిస్తూ ఇబ్బంది కలిగించేవారు. దీన్ని భరించలేని విద్యార్థినులు రాష్ట్రమహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో చైర్‌పర్సన్ మంజుళమానస గురువారం అధికారులతో కలిసి హాస్టళ్లను తనిఖీ చేశారు. విద్యార్థినులు చెప్పిన వివరాలతో ఆమె విస్తుపోయారు.
మద్యం మత్తులో రాత్రి వేళ హాస్టల్‌కు వచ్చి అందరినీ ఒక చోటుకు చేర్చి ‘మీకు సెక్స్ అంటే తెలుసా? భార్యాభర్తల సంబంధం గురించి మీకేం తెలుసు? పీరియడ్స్‌లో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీలో ఎంతమంది లవ్‌లో పడ్డారు? సెక్స్‌పై మీ అభిప్రాయం ఏమిటి?' అని అడుగుతుంటారని కంట తడిపెట్టారు. దీంతో ఆవేశానికి లోనై అక్కడి నుంచే ఆమె ఆ అధికారికి ఫోన్ చేసి మందలించారు.

తాను సాంఘిక సంక్షేమశాఖ మంత్రి ఆంజనేయకు సమీప బంధువని, తనను ఎవరూ ఏమీ చేయలేరని కూడా బెదిరిస్తుంటారని పలువురు ఉద్యోగులు ఆమెకు చెప్పుకున్నారు. వార్డన్లు, మహిళా సిబ్బంది పట్ల కూడా అనుచితంగా మాట్లాడుతూంటారని ఆరోపించారు. ఈ విషయమై మంత్రితో చర్చలు జరుపుతామని మహిళా కమిషన్ అధ్యక్షురాలు మంజుళమానస మీడియాకు వివరించారు.
మహిళా కమీషన్ అధ్యక్షురాలు మంజుళ మానస సాంఘిక సంక్షేమ శాఖకు, రామనగర్ పోలీసులకు తన నివేదికను సమర్పించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications