ఆంధ్ర టెక్కీ దారుణ హత్య: కర్ణాటక చెరువులో బాడీ

బెంగళూరు: సాఫ్ట్ వేర్ ఇంజనీరును దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని తీసుకు వెళ్లి చెరువులో విసిరి వేసిన సంఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా లో జరిగింది. హత్య చేసిన నిందితులు మృతదేహాన్ని గుర్తు పట్టకుండా చెయ్యడానికి అర్దరాత్రి చెరువులో విసిరివేసి వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తంబాళ్లపల్లి సమీపంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కేశవరెడ్డి (35) హత్యకు గురైనాడని మంగళవారం పోలీసులు చెప్పారు. నాలుగు సంవత్సరాల క్రితం శిల్పతో కేశవరెడ్డి వివాహం జరిగింది.

software engineer murdered in karnataka

కేశవరెడ్డి బెంగళూరు చేరుకుని బాణసవాడిలో నివాసం ఉంటున్నాడు. ఇతను బెంగళూరు నగరంలోని రిచ్మెండ్ రోడ్డులోని ఆక్టీవ్ ఇండియా అనే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం బెంగళూరు-మదనపల్లి (ఆంధ్రప్రదేశ్) మార్గంలోని తాడ్ గోళ్ల క్రాస్ దగ్గర ఉన్నచెరువులో శవం తేలుతూ కనిపించింది.

శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు అధికారి విశాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైయ్యింది కేశవరెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని గుర్తించి, వివరాలు సేకరించారు. మూడు రోజుల క్రితం హత్య చేసి శవాన్ని తీసుకు వచ్చి చెరువులో విసిరివేశారని, మృతదేహాం కుళ్లి పోయిందని, హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+