సోలార్ స్కాం: సరితా నాయర్ ఆంటీకి జైలు శిక్ష
కేరళ రాజకీయాలను కుదిపేసిన రూ. వందల కోట్ల సోలార్ స్కాం కేసులో ప్రముఖ నిందితులు బిజు రాధాకృష్ణన్ , సరితా నాయర్ లకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది.
తిరువనంతపురం: కేరళ రాజకీయాలను కుదిపేసిన రూ. వందల కోట్ల సోలార్ స్కాం కేసులో ప్రముఖ నిందితులు బిజు రాధాకృష్ణన్ , సరితా నాయర్ లకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది.
కొచ్చిలోని పెరుంబవూరులోని మేజిస్ట్రేట్ కోర్టు సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్ లకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 10 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో నటి శాలు మెనన్ కు నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

కేరళలో సోలార్ స్కాంకు సంబంధించి 33 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క కేసులోనే కోర్టు తీర్పు చెప్పింది. సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఇప్పిస్తామని నమ్మించి తన భాగస్వామి, వ్యాపారవేత్త పి. సజ్జద్ నుంచి రూ. 40 లక్షలు తీసుకుని సరితా నాయర్, బిజు మోసం చేశారని కేసు నమోదు అయ్యింది.

ఈ కేసులోనే సరితా నాయర్, బిజుకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అయితే బిజు అతని భార్యను హత్య చేశాడని నేరం రుజువు కావడంతో యావజ్జీవ శిక్షపడింది. ప్రస్తుతం బిజు జైలులో ఉన్నాడు. ఇదే కేసులో బిజు తల్లి రాజమ్మల్ సైతం మూడేళ్లు జైలు శిక్షకు గురై జైలులో ఉన్నారు.












Click it and Unblock the Notifications