జవాన్ల మధ్య తీవ్ర ఘర్షణ: కాల్పులు, ఒకరి మృతి
మాల్దా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా బిఎస్‌ఎఫ్ క్యాంపులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏడుగురు జవాన్ల మధ్య మొదలైన చిన్న గొడవ తీవ్ర ఘర్షణ దారితీసింది. ఈ ఘర్షణలో ఒక జవాను మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంలో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన బసంత్ సింగ్ అనే కానిస్టేబుల్ అక్కడ్నుంచి పరారయ్యాడు.
సోమవారం రాత్రి జరిగిన ఘర్షణ కారణంగా మంగళవారం ఉదయం బసంత్ సింగ్ జరిపిన కాల్పుల్లో మూల్‌చంద్ అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. బసంత్ సింగ్ వద్ద ఆయుధం లేకపోవడంతో మరో జవాను వద్ద నుంచి తీసుకొని మూల్‌చంద్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం.

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని గోలికోట్ నుంచి ఇండోర్ వస్తున్న ప్రైవేటు బస్సు జబువా ప్రాంతంలో లోయలో పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో 40 మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ధార్ మరియు జబువా జిల్లాల నుండి సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications