అశాంతిని నెలకొల్పే అవకాశం.. అప్రమత్తంగా ఉండండి: అజిత్ దోవల్
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని కామెంట్ చేశారు. ఆయన శనివారం ఓ ఢిల్లీలో సూఫీ సజ్జదనాశిన్ కౌన్సిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మతం పేరుతో దేశంలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. కుట్రను భగ్నం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
పీఎఫ్ఐ లాంటి యూనియన్లపై నిషేధం విధించాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. జాతీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చర్యలకు ఉపక్రమిస్తామని తెలిపింది. అందరం ఒక్కటై గొంతు వినిపించాలి.. తప్పులను సరిదిద్దుకోవాలని కోరారు. దేశంలో ప్రతీ ఒక వర్గం కలిపి దేశం అని పేర్కొన్నారు.

సమావేశానికి హాజరైన సూఫీ మత పెద్దలు కూడా రాడికల్ సంస్థలపై నిషేధం విధించాలని కోరాయి. పీఎఫ్ఐ సహా ఏ సంస్థ అయినా సరే నిషేధం విధించాలని ఆల్ ఇండియా సూఫీ సజ్జాదా నషీన్ కౌన్సిల్ చైర్ పర్సన్ హజ్రత్ సయ్యద్ నసీరుద్దీన్ చిప్తీ అన్నారు. ఇందుకు సంబంధించి తీర్మానం ప్రవేశ పెట్టగా.. సమావేశం ఆమోదం తెలిపింది.
జాతీయ భద్రతా సలహాదారు హోదాలో ఉన్న అధికారి నుంచి ప్రకటనలేమీ రావు. జాతీయ భద్రతా సలహదారు నుంచి ఏ సమాచారమైనా తొలుల ప్రధాన మంత్రిత్వ కార్యాలయానికి చేరుతుంది. పీఎంఓ, లేదంటే ఆయా అంశాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు ప్రకటన జారీ చేస్తాయి. ఈ సారి నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications