రాహుల్ గాంధీకి చుక్కెదురు, బంద్ తో స్వాగతం, కాంగ్రెస్ కు ప్రతిష్ట, బీజేపీ ప్రతీకారం!

Posted By:
Subscribe to Oneindia Telugu

బీదర్/బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చుక్కెదురైయ్యింది. కర్ణాటకలో నాలుగు రోజులు పర్యటించి శాసన సభ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వచ్చిన రాహుల్ గాంధీకి బీదర్ జిల్లాలో బంద్ తో స్వాగతం పలికారు. రైతులు ఇచ్చిన బీదర్ జిల్లా బంద్ కు స్థానికులు స్వచ్చందంగా మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.

ప్రభుత్వానికి చాలెంజ్

ప్రభుత్వానికి చాలెంజ్

రాహుల్ గాంధీ నాలుగు రోజుల పర్యటన విజయవంతం చెయ్యాలని కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం చాలెంజ్ కు తీసుకుంది. రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ బళ్లారి జిల్లాలో పర్యటించారు. సోమవారం ఆయన బీదర్ జిల్లాలో అడుగు పెడుతున్నారు.

బీదర్ జిల్లా బంద్

బీదర్ జిల్లా బంద్


కందిపప్పు (తూర్ దాల్) కు విక్రయ కేంద్రం (మార్కెట్) స్థాపించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని బీదర్ జిల్లా బంద్ కు పిలిపునిచ్చారు. బీదర్ లో సోమవారం రాహుల్ గాంధీ బహిరంగ సభ సమావేశం ఏర్పాటు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీనాయకులు చాల రోజుల క్రితం నిర్ణయించారు.

బంద్ దెబ్బకు రాహుల్ గాంధీ

బంద్ దెబ్బకు రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ బహిరంగ సభ సమావేశం మీద బంద్ ప్రభావం పడటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. రాహుల్ గాంధీ బహిరంగ సభ సమావేశం సక్సస్ కాకపోతే చెడ్డపేరు వస్తోందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు సంఘాల నాయకులతో రాజీ చర్చలు జరుపుతున్నారు.

విద్యాసంస్థలు బంద్

విద్యాసంస్థలు బంద్

కందిపప్పు విక్రయ కేంద్రం (మార్కెట్) స్థాపించాలని, బీఎస్ఎస్ కే ఫ్యాక్టరీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న బీదర్ జిల్లా బంద్ కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు వచ్చింది. సోమవారం అధికారికంగా బీదర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

అమిత్ షా కు సెగ

అమిత్ షా కు సెగ

జనవరి 25వ తేదీ అమిత్ షా మైసూరులో జరిగిన బీజేపీ పరివర్తనా యాత్ర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ రోజు కర్ణాటక రాష్ట్ర బంద్ జరిగింది. ఆ సమయంలో కేవలం బీజేపీ బహిరంగ సభ సమావేశం అడ్డుకోవడానికి సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం బంద్ కు మద్దతు ప్రకటించిందని అమిత్ షా ఆరోపించారు.

కాంగ్రెస్ కు సవాల్

కాంగ్రెస్ కు సవాల్

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ రోజు బీదర్ జిల్లా లో బంద్ కు పిలుపునివ్వడంతో సిద్దరామయ్య ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. బహిరంగ సభ సక్సస్ కాకపోతే అధిష్టానం దగ్గర చెడ్డపేరు వస్తోందని సిద్దరామయ్య ఆందోళన చెందుతున్నారు.

కసితీర్చుకున్న బీజేపీ

కసితీర్చుకున్న బీజేపీ


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ సభ సందర్బంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక బంద్ కు మద్దతు ఇచ్చిందని బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా బీదర్ జిల్లా బంద్ కు పిలుపునివ్వడంతో బీజేపీ నాయకులు రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించి బంద్ ను విజయవంతం చేపి కసితీర్చుకుంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Some farmer organisations call Bidar bandh, demanding to start Tur crop market in Bidar on Feb 12th. AICC president Rahul Gandhi will be addressing a rally here today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి