వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ ట్రైలరే.. సినిమా ముందుంది, మరింత మంది చేరతారు: తరుణ్ చుగ్

|
Google Oneindia TeluguNews

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనుండటంతో ఆ పార్టీకి బూస్టింగ్ ఇవ్వనుంది. మరికొంత మంది నేతలు బీజేపీలో చేరతారని విశ్వాసంతో ఉంది. కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడారు. ఆయన కూడా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం అవుతున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లి.. తెలంగాణ బీజేపీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ని కలిశారు.

చాలా మంది క్యూ

చాలా మంది క్యూ

తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించామ,ని బీజేపీలోకి చాలామంది నేతలు చేరుతారని తెలిపారు. దాసోజు శ్రవణ్ బీజేపీలోకి చేరటం అనేది సంతోషించాల్సిన విషయం అన్నారు. శ్రవణ్ తమ విద్యార్థి పరిషత్‌లో పనిచేశారని గుర్తు చేశారు. బీజేపీలో ఇంకా చాలామంది నేతలు చేరుతారని.. ఇది ట్రైలర్ మాత్రమేనని సినిమా ముందు ఉందన్నారు.

 దోచుకుని తింటుంది

దోచుకుని తింటుంది


కేసీఆర్ ప్రభుత్వం దోచుకుని తింటోందని విమర్శించారు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీని గద్దెనెక్కించిన ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు గుడ్ బై చెప్పనున్నారని తెలిపారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ కూడా కేసీఆర్‌కు ఇదే చెప్పాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కీలకంగా పనిచేశారని గుర్తు చేశారు.

Recommended Video

జనసేనలోకి పృధ్విరాజ్, ఎమ్మెల్యేగా పోటీ ఎక్కడ అంటే? *Andhrapradesh | Telugu OneIndia
 జంపింగ్ జపాంగ్

జంపింగ్ జపాంగ్


వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న సమయంలో ఆయా పార్టీల నేతలు ఇప్పటినుంచి చేరికలతో బిజీగా ఉన్నారు. ఏ పార్టీలోకి వెళ్లాలి? ఏ పార్టీలోకి వెళితే తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది? అనే వ్యూహాల్లో ఉన్నారు. తెలంగాణలోని పార్టీల నేతలు ఏ పార్టీలోకి ఎవరు? ఎప్పుడు? చేరతారో తెలియకుండా ఉంది. ఇలాంటి పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరు ఏ పార్టీలోకి వస్తున్నారో, ఎవరు పార్టీని ఎప్పుడు వీడుతారో తెలియని గందరగోళ పరిస్థితి ఉంది.

English summary
some other leaders are to join bjp bjp telangana incharge tarun chug said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X