సీఆర్‌పీఎఫ్ సంచలన వ్యాఖ్యలు: కేంద్ర నిధుల కోసం నక్సల్ హింసకు ప్రోత్సాహం..!
న్యూఢిల్లీ: ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ దిలీప్ త్రివేది నక్సల్స్ ప్రభావిత రాష్ట్రలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్‌లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తన ఆలోచనలను పంచుకున్నారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు మావోయిజం కొనసాగాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు.
నక్సల్ హింస కొనసాగించడం వల్ల... కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఆయా రాష్ట్రాలు భావిస్తున్నాయని ఆయన చెప్పారు. పేలుడు పదార్థాల అమ్మకాల నియంత్రణను కేంద్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని, దీంతో, అవి మావోయిస్టులకు సులభంగా అందుతున్నాయని వెల్లడించారు.

ఈ కారణంగా భద్రతా బలగాల సిబ్బంది అత్యధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని దిలిప్ త్రివేది వివరించారు. జమ్మూ కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆరోపణలు చేశారు.
ఆయా రాష్ట్రాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అవసరం లేదని పరోక్షంగా చెప్పి.. సింపుల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సరిపోతుందని చెప్పారు. కొన్ని దళాల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్వహించిన వివిధ కమిటీలు మరియు అధ్యయనాల వల్ల ప్రజా ధనం వృధా అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications