తండ్రి ఇంట్లో కొడుకు ఎందుకుండాలి ? ఢిల్లీ హైకోర్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తండ్రి కష్టపడి సంపాధించిన ఇంటిలో కొడుకు ఉండటానికి వీలులేదని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆయన కష్టార్జితంతో సంపాధించిన ఆస్తిలో వాటా అడిగే హక్కుకాని, బలవంతంగా ఆ ఇంటిలో ఉండటానికి కొడుకుకు ఎలాంటి హక్కులేదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది.

అయితే తండ్రి కనికరిస్తే మాత్రం ఆ ఇంటిలో కొడుకు ఉండటానికి అవకాశం ఉందని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. కొడుకుకు పెళ్లి అయినా, కాకపోయినా ఈ తీర్పు వర్తిస్తుందని న్యాయస్థానం చెప్పింది.

కొడుకుకు పెళ్లి అయినా, కాకపోయినా తండ్రి ఆస్తిలో భాగం అడగడానికి వీలులేదు. అయితే వారు దయదలచి ఆశ్రయం ఇస్తే మాత్రం తండ్రి ఇంటిలో ఉండటానికి వీలు ఉంటుందని కోర్టు తీర్పు చెప్పింది.

Son has no legal right in parents house, can stay at their mercy

అంతే కాని కొడుకు పుట్టిన తరువాత అతన్ని జీవితాంతం పెంచిపోషించాలని చట్టం ఏమీ లేదని న్యాయస్థానం చెప్పింది. తన స్వాధీనంలో ఉన్న ఇంటి మేడ మీద ఉంటున్న కొడుకు, కోడలను ఖాళీ చేయించాలని ఓ తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

నిత్యం తన కుమారుడు, కోడలు మమల్ని వేధిస్తున్నారని ఆ తండ్రి కోర్టులో ఆవేదన చెందాడు. ఈ కేసు విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు ఈ సంచలన తీర్పు చెప్పింది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర 20 సంవత్సరాల క్రితం ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఉపేంద్ర (ఉపేంద్ర-1) సినిమాలో ఇలాంటి డైలాగులు ఉన్నాయి.

ఆ సినిమాలో ఉపేంద్ర ఎవరి ఇల్లు కనపడితే వారి ఇంట్లోకి వెళ్లి అమ్మా, నాన్న, అన్న, తమ్ముడు, చెల్లి అంటూ వారిని వేధిస్తుంటాడు. తండ్రి ఆస్తిలో కొడుకుకు ఎలాంటి హక్కు ఉండదని, తాను ప్రధాని అయితే తండ్రి ఆస్తి కొడుకుకు చెందకుండా ప్రత్యేక చట్టం తీసుకు వస్తానని అనే మాటలు ఆయనే రాసి తనదైన శైలిలో డైలాగులు చెప్పాడు. ఇప్పుడు ఆ మాటలు నిజం అవుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A son, irrespective of his marital status, has no legal right to live in the self-acquired house of his parents and can reside there only at their mercy, the Delhi High Court has said.
Please Wait while comments are loading...