" రేపటి లోగా వాళ్లను వదలకపోతే రంగంలోకి..!" - సోనమ్ వాంగ్ చుక్ అల్టిమేటం..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అభిజీత్ దిప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లతో పాటు వేల మందిని పోలీసులు నిర్బంధించడాన్ని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk) తప్పుబట్టారు. వారిని రేపటి లోగా వదిలిపెట్టకపోతే నిరాహారదీక్షకు దిగుతానని, లేకపోతే పాదయాత్ర ప్రారంభిస్తానని సోనమ్ కేంద్రాన్ని హెచ్చరించారు. దీంతో కాక్రోచ్ నేతల్ని నిర్బంధించి నిరసనల్ని అణచివేసినట్లు భావిస్తున్న కేంద్రం ఇప్పుడేం చేస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

'Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!
'Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!

ఢిల్లీ నిరసనల నేపథ్యంలో ఇంతవరకూ కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులకు మద్దతు మాత్రమే ప్రకటిస్తూ, లడఖ్ లో తన పని తాను చూసుకుంటున్న సామాజి కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్.. ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. గతంలో నీట్ నిరసనల సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులకు మద్దతుగా ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ వద్ద 21 రోజుల పాటు నిరాహారదీక్ష చేసిన సోనమ్ దెబ్బకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఈసారి మాత్రం లడఖ్ లో బిజీగా ఉన్న ఆయన.. ఢిల్లీకి రావాలని భావించలేదు. కానీ ఇవాళ సీజేపీ నేతల నిర్బంధాలతో మనసు మార్చుకున్నారు.

Sonam Wangchuk Threatens Fast or Padyatra if CJP Protesters Aren t Released by Tomorrow
Abhijeet Dipke: విమానంలోనే అభిజీత్ దిప్కే అరెస్ట్-ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత..!
Abhijeet Dipke: విమానంలోనే అభిజీత్ దిప్కే అరెస్ట్-ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత..!

అప్రకటిత అత్యవసర పరిస్థితిలో భారతదేశం ఉందంటూ సోనమ్ వాంగ్ చుక్ ఇవాళ ట్వీట్ చేశారు. నిన్న తాను నేటి నిరసనలో ఐక్యత, శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేసినప్పుడు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అప్రకటిత అత్యవసర పరిస్థితిలో ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదని వాంగ్ చుక్ తెలిపారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి చాలా మంది నాయకులు ఉన్నందుకు తాను సంతోషించానని, కానీ ఇప్పుడు వారందరినీ అరెస్టు చేశారని తెలుసుకున్నానని పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిని త్వరలో విడుదల చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. రేపటిలోగా వారిని విడుదల చేయకపోతే, తాను అహింసా నిరాహార దీక్ష లేదా పాదయాత్ర చేపట్టవలసి వస్తుందని కేంద్రాన్ని సోనమ్ వాంగ్ చుక్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+