మోడీ 'స్కామ్ ఇండియా' వ్యాఖ్యలపై మండిపడ్డ సోనియా, ఏడాదిలో చేసిందేమీ లేదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ యూపీఏ ప్రభుత్వ పని తీరుని విమర్శిస్తూ విదేశీ గడ్డపై మాట్లాడటాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బుధవారం సోనియా గాంధీ మాట్లాడారు.
ఈ రోజు కార్టూన్
ఈ సందర్భంగా ఆమె ఏడాది కాలంలో మోడీ ప్రభుత్వం ఎలాంటి పనిని ప్రారంభించలేదన్నారు. ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వ పరిపాలన ఒక మనిషితో సాగుతోందన్నారు. మంత్రులకు ఎలాంటి అధికారులు లేకుండా ప్రధాన మంత్రి కార్యాలయం చుట్టూ అన్ని అధికారాలు తిరుగుతున్నాయన్నారు.

ఇటీవల ప్రధాని మోడీ కెనడా పర్యటనలో ప్రవాస భారతీయలను ఉద్దేశించి ప్రసంగించిన సభలో యూపీఏ ప్రభుత్వ పాలనను 'స్కామ్ ఇండియా'గా అభివర్ణించిన సంగతి తెలిసందే. టొరొంటోలో నిర్వహించిన సభలో భారత్ 'స్కామ్ ఇండియా' నుంచి 'స్కిల్ ఇండియా'గా మారుస్తానన్నారు.
As Modi govt completes 1yr, it has very little to showcase: Congress President Sonia Gandhi at Congress Party Parliamentary meet
— ANI (@ANI_news) May 6, 2015 కెనడాలోని రైకో కోలిజియంలో ప్రధాని మోడీ ప్రసంగించిన సభలో గతంలో ఇండియా అంటే స్కామ్ ఇండియాగా ఉందని, దానిని మేము స్కిల్ ఇండియాగా మారుస్తామని చెప్పారు. ఇటీవలే రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో రైతుల ఆత్మహత్యలపై ప్రధాని మోడీని నిలదీసిన సంగతి తెలిసిందే.
8 core sectors of economy registered -ve growth due to steep decline in production of steel,cement,fertilizer&refinery products:Sonia Gandhi
— ANI (@ANI_news) May 6, 2015 ఇప్పడు తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్లమెంట్‌లో మోడీ ఏడాది పరిపాలనపై మాట్లాడనున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం మేరకు ఎన్‌డీఏ ప్రభుత్వంలో కీలక శాఖల పనితీరు, ఆయా శాఖల్లో పేరుకుపోయిన ఖాళీలపై పూర్తి స్ధాయిలో అధ్యయనం చేశారని తెలుస్తోంది. అటు రాహుల్ గాంధీతో పాటు, ఇటు సోనియా గాంధీ కూడా ఎన్‌డీఏ ప్రభుత్వ ఏడాది పాలనను పార్లమెంట్‌లో ఎండగట్టేందుకు యత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications