అద్వానీ వైవాహిక జీవితానికి 50 ఏళ్లు: నాకూ అంటూ సోనియా...
న్యూఢిల్లీ: వైవాహిక జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బిజెపి సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అద్వానీ 50వ పెళ్లి వేడుకల సందర్భంగా సోనియా ఓ లేఖ రాశారు. ఆ లేఖలో అద్వానీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎల్‌కే అద్వానీ, కమల్ అద్వానీలకు నా శుభాకాంక్షలు. సుదీర్ఘమైన వైవాహిక జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉండి..విజయవంతంగా ముందుకెళ్తున్న అద్వానీ దంపతులు ఆదర్శ దంపుతులని పేర్కొన్నారు. ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజని.. ఎందుకంటే 47 ఏళ్ల కిందట ఇదే రోజున తాను రాజీవ్‌గాంధీని పెళ్లాడానని' అద్వానీ దంపతులకు రాసిన లేఖలో సోనియా పేర్కొన్నారు.

ఇది తనకు కూడా ప్రత్యేకమైన రోజు అని, 47 ఏళ్ల క్రితం తాను ఇదే రోజు తాను రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నానని ఆమె అన్నారు. జీవితం ఎగుడుదిగుళ్లలో పరస్పరం సహకారం అందించుకుంటూ యాభై ఏళ్ల వివాహ జీవితంలో అద్వానీ, కమల దపంతులు ముందుకు సాగారని సోనియా అన్నారు.
అద్వానీ దంపతులు ఆరోగ్యంగా, మరింత సంతోషంగా చాలా ఏళ్లు కలిసి జీవించాలని ఆమె కోరుకున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ తనకు కూడా ప్రత్యేకమై రోజు అని, ఇదే రోజు రాజీవ్, తానూ పెళ్లి చేసుకున్నామని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications