ఒడిశా రైలు ప్రమాదంపై సోనియా గాంధీ స్పందన; ఘటనా స్థలికి అధీర్ రంజన్ చౌదరి

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన దేశం మొత్తాన్ని కలచివేసింది. ఈ రైలు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 278 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. 900కు పైగా ప్రయాణికులు గాయాలపాలైనట్టు సమాచారం. ఇంకా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.

చెన్నై కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, ఒక గూడ్సు రైలు ఢీ కొన్న ప్రమాద ఘటనతో బాలాసోర్ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రమాద ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘోర రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

odissatrainaccidentsoniyagandiadhirranjan

దురదృష్టకర సంఘటనగా ఆమె అభివర్ణించారు. వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని సోనియాగాంధీ ప్రకటించారు.ఘటనా స్థలానికి వెళ్లి సహాయక కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మరోవైపు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని తెలుసుకోవాలని, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అనుబంధ సంఘాలు చేస్తున్నటువంటి సహాయక కార్యక్రమాలను సమీక్షించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్ సభ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరిని ఆదేశించారు. ఈ ఘటనపై స్పందించిన అధీర్ రంజన్ చౌదరి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న రైళ్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని తాను మొదటి నుంచి చెబుతున్నానన్నారు.

బుల్లెట్ ట్రైన్ ల కారణంగా ఎక్కువ మొత్తాన్ని దాని కోసం ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. రైళ్ళు ఢీకొట్టకుండా కవచ్ డివైస్ ల గురించి గొప్పగా చెబుతున్నారని, ఇంత ఘోర రైలు ప్రమాదం జరిగిందని, కవచ్ ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. రైల్వే శాఖ మొదటి ప్రాధాన్యత ప్రయాణికుల ప్రాణాలు కాపాడడం పైన పెట్టాలని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+