రాజ్యసభకు సోనియా గాంధీ- రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు ప్రియాంక..!
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈసారి లోక్ సభకు బదులు రాజ్యసభకు వెళ్లబోతున్నారు. ప్రస్తుతం రాయ్ బరేలీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆమె.. ఈసారి రాజ్యసభకు పోటీ చేసేందుకు వీలుగా రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రాజస్తాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె రేపు జైపూర్ లో నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సోనియాగాంధీ రాజ్యసభకు ఎంపికైతే.. నెహ్రూ కుటుంబం నుంచి పార్లమెంట్ ఎగువ సభకు వెళ్తున్న రెండో వ్యక్తిగా రికార్డులకెక్కనున్నారు. గతంలో మాజీ ప్రధాని, సోనియా అత్తగారైన ఇందిరా గాంధీ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇప్పుడు సోనియా కూడా ఎంపికైతే నెహ్రూ కుటుంబం నుంచి రెండో వ్యక్తి అవుతారు. ఆరోగ్య కారణాలతో సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 27న 15 రాష్ట్రాల్లోని 56 సీట్లకు జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు సమర్పించేందుకు ఈ నెల 15 వరకూ గడువుంది.

అయితే ఇప్పటివరకూ రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు పోటీ చేస్తూ గెలుస్తున్న సోనియా గాంధీ ఈసారి రాజ్యసభను ఎంచుకోవడంతో ఆ సీటులో కుమార్తె ప్రియాంక గాంధీ బరిలోకి దిగే అవకాశం ఉంది. యూపీలో కాంగ్రెస్ పరిస్దితి తీసికట్టుగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కంచుకోటగా రాయ్ బరేలీ ఉంది. ఇక్కడ నెహ్రూ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఓడిపోలేదు. గతంలో ఇలాంటితే మరో కంచుకోటగా అమేథీ కూడా ఉన్నప్పటికీ 2019లో రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి ఓడిపోయారు.












Click it and Unblock the Notifications