వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదలకు మరో 3 నెలలు సరుకులు, ధాన్యం 5 కిలోలు పెంచండి, ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రస్తుత పరిస్థితులను గుర్తుచేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వైరస్ వల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడిందని ప్రధానంగా ప్రస్తావించారు.

క్లిష్ట సమయంలో ఆహార భద్రత రేషన్ కార్డు ద్వారా ఒక్కో అర్హుడికి 5 కిలోల రేషన్ ఉచితంగా అందించడాన్నిసోనియాగాంధీ కొనియాడారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉచితంగా అందించి.. కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తోన్నారని కొనియాడారు. అయితే పేదలపై దీర్ఘకాలంలో లాక్‌డౌన్ ప్రభావం చూపుతోందని సోనియాగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవనోపాధి కోసం కొన్ని సూచనలు పాటించాలని ప్రధాని మోడీని సోనియాగాంధీ కోరారు.

sonia writes letter to modi: another 3 months will be give ration

ఇప్పుడు అందజేస్తోన్న రేషన్ బియ్యం/గోధుములు ఉచితంగా 5 కిలోల నుంచి పది కిలోలు పెంచాలని సోనియా గాంధీ సూచించారు. జూన్ వరకు కాకుండా మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ వరకు పొడిగించాలని సూచించారు. ఆయా సరుకులు ఆరునెలలపాటు పేదలకు ఉచితంగానే అందించాలని కోరారు. మరికొందరికి ఆహార భద్రత కార్డు లేదని.. వారిని జాబితా నుంచి మినహాయించారు అని సోనియాగాంధీ గుర్తుచేశారు.

ఇప్పుడున్న ఆహార భద్రత కార్డు 2011 జనాభా లెక్కల ఆధారంగా అందజేసినవని పేర్కొన్నారు. పదేళ్లవుతోన్నందున.. మరింత మంది అర్హులైన పేదలు ఉన్నారని పేర్కొన్నారు. తాను సూచించిన సిఫారసులతో ఆహార ద్రవ్యల్యణం నుంచి ప్రజలను రక్షించుకొవచ్చని తెలిపారు.

English summary
Lakhs of vulnerable people across the country face chronic food insecurity due to the lockdown. sonia writes letter to pm modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X