జియా ఖాన్ మృతిపై వార్తలు: మీడియాపై జరీనా ఫైర్
ముంబై: నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో వచ్చిన వార్తలకు గాను సూరజ్ పంచోలి తల్లి, అలనాటి నటి జరీనా వాహబ్ తీవ్రంగా మండిపడ్డారు. జియా ఖాన్ ఆత్మహత్య కేసులో సూరజ్ పంచోలీని ప్రధా నిందితుడిగా పేర్కొంటూ సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసిందంటూ బుధవారంనాడు వార్తలు వచ్చాయి.
చార్జిషీట్‌లో ఏం ఉందో సిబిఐ చెప్పకపోయినా ఈ వార్తలు రావడంపై జరీనా వాహబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్జిషీట్‌లో ఏం రాశారో అధికారికంగా తెలియకుండా ఎవరో చప్పిన మాటలు నమ్మి వార్తలు రాయవద్దని ఆమె అన్నారు. సూరజ్ నిందితుడని ఇంకా తేలలేదని, నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయవద్దని ఆమె అన్నారు.

చార్జిషీట్‌లో ఏం ఉందో పూర్తిగా తెలిస్తేనే గానీ తాను స్పందించబోనని ఆమె అన్నారు. సూరజ్‌పై హత్యానేరం లేదని తెలిసినప్పటి నుంచి కొందరు అతన్నే లక్ష్యంగా చేసుకుని లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నరాని, ఇదంతా చేస్తోంది ఎవరో తనకు తెలుసునని ఆమె అన్నారు. జియా ఖాన్ తల్లి రబియా ఖాన్‌పై ఆమె ఆ విధంగా పరోక్ష వ్యాఖ్య చేశారు.
హత్య కాదని సిబిఐ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రబియా ఖాన్ గురించి ప్రస్తావిస్తూ తాను ఎవరి పేరూ చెప్పదలుచుకోలేదని, ఆమె ఇదంతా చేస్తుందనే విషయం తనకు తెలుసునని వాహెబ్ అన్నారు. జియాఖాన్‌ది ఆత్మహత్యేనని, సూరజ్‌తో గొడవ వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని సిబిఐ చార్జిషీట్‌లో పొందుపరిచినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications