ఇకపై ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు - రెగ్యులేషన్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
దేశవ్యాప్తంగా పలు సహకార బ్యాంకుల్లో మోసాలు, అక్రమాలు చోటుచేసుకోవడం, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు 2020ను రూపొందించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్ సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949ను సవరించే ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సహకార బ్యాంకుల్లో చోటుచేసుకునే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా డిపాజిటర్లను ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్నదని, డిపాజిటర్లను రక్షించాలన్న ఉద్దేశంతోనే ఈ సవరణ బిల్లును తీసుకొచ్చామని చెప్పారు.

మొత్తం 277 పట్టణ సహకార బ్యాంకుల ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్నదని, మరో 105 సహకార బ్యాంకులు కనీస నియంత్రణ మూలధన అవసరాన్ని తీర్చలేకపోతున్నాయని, 47 బ్యాంకుల నికర విలువ ప్రతికూలంగా ఉందని, 328 పట్టణ సహకార బ్యాంకులు 15 శాతం కంటే ఎక్కువ స్థూల ఎన్‌పీఏ నిష్పత్తిని కలిగి ఉన్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. సహకార బ్యాంకుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్న అధికారాలను విస్తరించడమే ఈ సవరణ బిల్లు ఉద్దేశమని నిర్మల స్పష్టం చేశారు.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు చట్టంగా మారిన తర్వాత.. ఆయా రాష్ట్రాల చట్టం ప్రకారం ఏర్పాటైన కో-ఆపరేటివ్ సొసైటీలు, స్టేట్ రిజిస్ట్రార్ అధికారాలను ప్రభావితం చేయబోదని, వ్యవసాయ కార్యకలాపాలకు దీర్ఘకాలిక రుణాలు అందించే ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలకు లేదా సహకార సంఘాలకు ఈ సవరణ బిల్లు వర్తించదని ఆర్థిక మంత్రి క్లారిటీ ఇచ్చారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications