బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో కిలాడీ లేడీ, మహిళ మర్మాంగంలో రూ. 8 కోట్ల డ్సగ్స్, అమెరికా టూ బెంగళూరు, ఎయిర్ పోర్టులో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగించడానికి మాఫియా ముఠా సభ్యులు రోజుకో కొత్త ప్లాన్ వేస్తున్నారు. విదేశాల నుంచి అక్రమంగా డ్రగ్స్ (కొకైన్) సరఫరా చేస్తున్న మహిళను బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం) అధికారులు అరెస్టు చేశారు. ఏకంగా రూ. 8 కోట్ల విలువైన కొకైన్ ను విదేశీ మహిళ ఆమె మర్మాంగం (ప్రైవేట్ పార్ట్స్)లో దాచిపెట్టుకుని ఎయిర్ పోర్టు నుంచి బయటకు రావడానికి విఫలయత్నం చెయ్యడంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

అమ్మాయి రివర్స్, స్వామీజీ మూడో పెళ్లి మటాష్, 420 కేసులు, కండలతో హీరో సల్మాన్ ఖాన్ కు సవాల్!అమ్మాయి రివర్స్, స్వామీజీ మూడో పెళ్లి మటాష్, 420 కేసులు, కండలతో హీరో సల్మాన్ ఖాన్ కు సవాల్!

అమెరికా మహిళ

అమెరికా మహిళ

సౌత్ అమెరికాలోని గ్వాట్ మాలా ప్రాంతానికి చెందిన మహిళ ఫిబ్రవరి 2వ తేదీన ET- 690 ఎయిర్ లైన్స్ విమానంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం) చేరుకుంది. తరువాత విదేశీ మహిళ లగేజ్ బ్యాగ్ తో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయటకు రావడానికి ప్రయత్నించింది.

అధికారులకు మస్కా కొట్టాలని ప్లాన్

అధికారులకు మస్కా కొట్టాలని ప్లాన్

అంతర్జాతీయ విమానాశ్రయం చేసుకున్న విదేశీ మహిళ బయటకు రావడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఎయిర్ పోర్టు అధికారులు సౌత్ అమెరికా మహిళను సోదాలు చేశారు. ఆ సమయంలో ఏం చెయ్యాలో తెలీక అయోమయానికి గురైన విదేశీ మహిళ అధికారుల దగ్గర అనుమానాస్పదంగా ప్రవర్తించింది.

డ్రగ్స్ ఉన్నాయి..... కానీ ఎక్కడ ?

డ్రగ్స్ ఉన్నాయి..... కానీ ఎక్కడ ?

విదేశీ మహిళ ప్రవర్తనపై అనుమానం ఎక్కువ కావడంతో ఎయిర్ పోర్టు అధికారులు ఆమెను మెటల్ డిటెక్టర్ తో పాటు అత్యాధునిక పరికరాలతో పరిశీలించారు. అదే సమయంలో మహిళ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని అధికారులు పసిగట్టారు. మహిళా అధికారులు విదేశీ మహిళను పరిశీలించినా ఎక్కడ డ్రగ్స్ ఉన్నాయి ? అనే విషయం చాలా సేపు అంతుచిక్కలేదు.

మహిళ మర్మాంగంలో రూ. 8 కోట్ల డ్రగ్స్

మహిళ మర్మాంగంలో రూ. 8 కోట్ల డ్రగ్స్

చివరికి కస్టమ్స్ మహిళా అధికారులు విదేశీ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా ఆమె తన మర్మాంగంలో కొకైన్ ఉందని అంగీకరించింది. మొత్తం 150 క్యాప్సిల్స్ లో కొకైన్ (డ్రగ్స్) నింపుకుని వాటిని ఆమె మర్మాంగంలో దాచిపెట్టినట్లు అంగీకరించింది.

Recommended Video

Jwala Gutta Exclusive Interview | Oneindia Telugu
రెండు రోజులు డ్రగ్స్ సేఫ్

రెండు రోజులు డ్రగ్స్ సేఫ్

మర్మాంగంలో డగ్స్ కరిగిపోకుండా క్యాప్సిల్స్ అలాగే ఉంటాయని, ఆ టెక్నాలజీని ఉపయోగించి సౌత్ అమెరికా నుంచి ఆ విదేశీ మహిళ బెంగళూరుకు కొకైన్ తీసుకువచ్చిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అయితే విదేశీ మహిళ వెనుక ఎవరెవరు ఉన్నారు ? అనే కోణంలో కస్టమ్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. విదేశీ మహిళను కోర్టు ముందు హాజరపరిచి విచారణ చేస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.

English summary
Bengaluru: Woman has been arrested at a South American Bengaluru International Airport accused of trying to Smuggle Cocaine inside her Private Part.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X