సౌత్ ఇండియాలో 12 హిడెన్ విలేజెస్ ఇవే.. లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే..!
సౌత్ ఇండియాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో అందమైన పర్యాటక ప్రాంతాలు, పురాతన ఆలయాలు, హిల్ స్టేషన్స్, అలాగే ప్రశాంతమైన సముద్ర తీరాలకు నిలయంగా ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలోని టూరిస్టు ప్రాంతాలను సందర్శించేందుకు అధిక సంఖ్యలో టూరిస్టులు తరలివస్తుంటారు. అయితే సౌత్ ఇండియాలో 12 హిడెన్ విలేజెస్ కు ఇప్పుడు పర్యటకుల తాకిడి పెరిగింది. రద్దీకి దూరంగా ప్రశాంతతకు దగ్గరగా ఉండాలని కోరుకునేవారు ఇప్పుడు ఈ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. వాటిలో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి ఒకటి. ఈ ప్రాంతం విశాఖపట్నం నుంచి సుమారు 100 కి. మీ. దూరంలో ఉన్న అందమైన పర్వత గ్రామం. చల్లని వాతావరణం, కాఫీ తోటలు, కొండ ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన గ్రామం ఇది. సౌత్ ఇండియాలోని అత్యంత చల్లని ప్రాంతాల్లో ఇదీ ఒకటి. అలాగే ఇక్కడ ఫొటోగ్రఫీకి అద్భుతమైన ప్రదేశంగా ఉంది. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రదేశంగా లంబసింగి ఉంది.
తమిళనాడు తేని జిల్లాలోని మెఘమలై ప్రాంతం ఎత్తయిన పర్వతాల మధ్య విస్తరించి ఉంది. ఇక్కడి కాఫీ తోటలు, టీ తోటలు, ఇలా ఎటు చూసినా పచ్చని అడవులు పర్యటకులకు స్వర్గధామంగా ఉన్నాయి. చల్లని గాలులు, పచ్చని రమణీయమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడి ప్రాంతం సొంతం. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో మంజోలై పర్యాటక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఉంది. ఇక్కడ పచ్చని ఎత్తయిన కొండలు, టీ తోటలు, సహస సౌందర్యమైన అడవులకు నిలయంగా ఉంది. ఇక కేరళలోని మున్నార్ సమీపంలో చిన్న కానల్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడి జలపాతాలు, అందమైన లోయలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. అలాగే కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలోని బాలెహొన్నూర్ ప్రాంతం అందమైన కాఫీ తోటలు, పచ్చని పర్వత శ్రేణులు, నదీ అందాలకు నెలవుగా ఉంది.

కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలోని కలస ప్రాంతం ఒకటి. ఈ ప్రాంతాన్ని టెంపుల్ టౌన్ అని పిలుస్తుంటారు. కలస గ్రామాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడి కాలభైరవేశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే తమిళనాడు కొడైకెనాల్ లోని కూకల్ గ్రామాన్ని అందమైన హిల్ స్టేషన్ అని పిలుస్తుంటారు. ఇక్కడి గడ్డి భూములు, సరస్సులు, షోలా అడవులను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంతం మున్నార్ కు సమీపంలోనే ఉంది. అలాగే కేరళలోని సూర్యనెల్లి గ్రామం.. ఇది ఒక ప్రశాంతమైన టీ తోటల గ్రామంగా పేరుగాంచింది. ఇక్కడి కొండల నుంచి వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కేరళ లోని గవి ప్రాంతం పథనంతిట్ట జిల్లాలో ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామం ఇది. ఇక్కడి సరస్సులు, వన్యప్రాణులు, అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవుగా ఉంది. వీటితో పాటు తమిళనాడులోని పూంబరై, కేరళలోని వట్టవాడ, కేరళలోని కాంతలూరు గ్రామం చాలా ప్రసిద్ధి చెందాయి.












Click it and Unblock the Notifications
