వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండ్రోజుల ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు: ఇక వర్షకాలం మొదలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రెండ్రోజుల ఆలస్యంగా దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు కేరళ దక్షిణ ప్రాంతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఈ రుతుపవనాల ఆగమనంతో దేశంలో నాలుగు నెలల వర్షాకాలం మొదలవుతోంది.

ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో దేశ వ్యాప్తంగా సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. వాస్తవానికి జూన్ 1నే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెండు రోజుల ఆలస్యంగా గురువారం కేరళను తాకాయి.

Southwest Monsoon Hits Kerala: Weather Department

ఈ క్రమంలో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం, శుక్రవారం వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మనదేశంలో దాదాసు సంగం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు వర్షాధారమైనవే కావడం గమనార్హం.

ప్రధానంగా నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి పంటలు పండిస్తారు. గత రెండేళ్లుగా (2019, 2020) దేశంలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఇటీవల వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడనున్నాయి.

English summary
The southwest monsoon made an onset over Kerala today after a delay of two days, the India Meteorological Department said. The onset over Kerala marks the commencement of the four-month rainfall season in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X