రుతుపవనాలు ఆలస్యమే.. ఐఎండీ ప్రకటన.. ఈశాన్య రాష్ట్రాల్లోనే..
జూన్ మూడో వారం ముగుస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో వర్షం మాత్రం కురవడం లేదు. ఏదో ఒక ప్రాంతంలో మాత్రమే వర్ష ప్రభావం ఉంటుంది. మిగతా చోట్ల వాన జాడ ఉండటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు అనుకున్న స్థాయిలో రావడం లేదు. ఐఎండీ కూడా ప్రకటనను సవరించింది. వర్షపాతం ఎక్కువే అని చెప్పింది. కానీ రియాల్టి మాత్రం అలా లేదు.
భారత వాతావరణ విభాగం మరో సమాచారం అందజేసింది. రుతు పవనాల ఆలస్యం గురించినా ప్రకటన చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో తప్ప నైరుతి రుతుపవనాలు దేశంలోని మిగతా భాగాల్లో ప్రభావం చూపడం లేదని పేర్కొంది. నైరుతి రుతుపవనాల విస్తరణపై భారత వాతావరణ విభాగం తాజా సమాచారం అందించింది. రుతుపవనాలు ఇవాళ మధ్యప్రదేశ్‌లోని చాలా భాగాల్లోకి, చత్తీస్ గఢ్, కోస్తాంధ్ర, వాయవ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి, ఒడిశా మొత్తానికి, పశ్చిమ బెంగాల్ గంగా పరీవాహక ప్రాంతానికి, ఝార్ఖండ్, బీహార్ లోని చాలా ప్రాంతాలకు, ఉత్తరప్రదేశ్ నైరుతి భాగానికి విస్తరించినట్టు ఐఎండీ వివరించింది.

వచ్చే రెండ్రోజులపాటు ఉత్తర, మధ్య, తూర్పు భారతంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మాత్రమే వర్షం కురుస్తోంది. ఈ సారి గట్టి వానలు పడిన దాఖలాలు కనిపించడం లేదు. ఉరుములు, మెరుపులు వస్తున్నాయే తప్ప.. ఆశించిన స్థాయిలో వర్ష ప్రభావం లేదు.
గట్టి వాన కురవకపోవడంతో పంట వేయడానికి రైతులు ఎదురుచూస్తున్నారు. బోర్లు, బావులు ఉన్నవారు ధైర్యం చేసి వేస్తున్నారు. కెనాల్ కింద సాగు ఉన్న వారు మాత్రం ఆలోచిస్తున్నారు. పంట వేయడానికి కాస్త సమయం తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications