జూన్ 25-30 నాటికి ఢిల్లీకి నైరుతి రుతుపవనాలు: పలు ఉత్తరాది రాష్ట్రాల్లోకి ఎంట్రీ, 2న కర్ణాటకకు

న్యూఢిల్లీ: సాధారణ ప్రారంభ తేదీ కంటే మూడు రోజుల ముందుగానే నౌరుతి రుతుపవనాలు ఆదివారం కేరళకు రావడంతో.. జూన్ 25-30 మధ్య ఢిల్లీ, ఇతర పొరుగు ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉంది.భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన రుతుపవనాల మ్యాప్ ప్రకారం.. జూన్ 25-30 మధ్యకాలంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలకు కాలానుగుణ వర్షాలు చేరుకుంటాయి.

ఇది జూన్ 30-జూలై 5 మధ్య రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాలకు మరింత ముందుకు సాగుతుంది.ఇంకా, వాతావరణ శాఖ ప్రకారం.. ఢిల్లీ, వాయువ్య, మధ్య భారతదేశం మీద వచ్చే ఐదు రోజుల పాటు వేడిగాలులు ఉండవు.

నైరుతి రుతుపవనాలు ఆదివారం కేరళకు చేరుకున్నాయి, దాని సాధారణ ప్రారంభ తేదీ (జూన్ 1) కంటే మూడు రోజుల ముందుగా, దేశంలో నాలుగు నెలల వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది.

Southwest monsoon likely to arrive in Delhi during June 25-30: IMD

'కర్ణాటక, తమిళనాడు, బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని మరిన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ఇప్పుడు పరిస్థితులు మరింత అనుకూలంగా ఉన్నాయి' అని ఐఎండీ పేర్కొంది.

కర్ణాటకకు జూన్ 2 నాటికి రుతుపవనాలు

జూన్ 2 నాటికి నైరుతి రుతుపవనాలు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను తాకేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బెంగళూరు సహా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం, త్వరలో ఉత్తర కన్నడ, కోస్తా జిల్లాలు, బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, హాసన్, శివమొగ్గ, రామనగర, కొడగు, చిక్కమగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+