వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రి సంచలనం: ఎస్పీ-బీఎస్పీతో బీజేపీకి డ్యామేజ్, సీట్లు తగ్గుతాయి..

|
Google Oneindia TeluguNews

లక్నో: 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుందా?.. భవిష్యత్తు రాజకీయంపై అప్పుడే ఎన్డీయేలో ఆందోళన మొదలైందా?.. సమాధానాలు మాత్రం అవుననే వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి, ఎన్డీయేలో భాగస్వామి అయిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యుడు రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీ చేస్తే ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి డ్యామేజ్ తప్పదని రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదే జరిగితే.. బీజేపీకి డ్యామేజ్

అదే జరిగితే.. బీజేపీకి డ్యామేజ్

ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో బీజేపీ 25-30 సీట్ల వరకు కోల్పోయే అవకాశం ఉందన్నారు. అయితే తిరిగి అధికారాన్ని చేపట్టేది మాత్రం బీజేపీయే అన్నారు. కాగా, 2014 లోక్ సభ ఎన్నికల్లో 80సీట్లకు గాను 71సీట్లు గెలుచుకుంది బీజేపీ. ఇందులో మిత్రపక్షమైన అప్నాదల్ పార్టీవి 2 సీట్లు.

Recommended Video

యోగి-ఆజంఖాన్ చేతులు కలిపారు , వీడియో వైరల్ !
ఇది నా అంచనా:

ఇది నా అంచనా:

లక్నోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాందాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 50 పైచిలుకు స్థానాలను దక్కించుకుంటుందని, అలాగే ఎస్పీ-బీఎస్పీ 25-30సీట్ల వరకు గెలుచుకోవచ్చునన్నది తన అంచనా అని చెప్పారు.
బలాలు బలహీనతలు ఎప్పుడూ ఉంటాయని, ఉత్తరప్నదేశ్ లో 25-30సీట్లను కోల్పోయినా.. మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పట్టు నిలుపుకుంటుందని, తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు.

అంబేడ్కర్ పేరు మార్పుపై:

అంబేడ్కర్ పేరు మార్పుపై:

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును భీమ్ రావ్ రామ్ జీ అంబేడ్కర్ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నట్టు రాందాస్ అథవాలే తెలిపారు. తండ్రి పేరును ఇంటి పేరుకు ముందు జోడించడం మహారాష్ట్రలో ఆనవాయితీగా కొనసాగుతోందని అన్నారు. కాగా, రాందాస్ అథవాలే కూడా మహారాష్ట్రకు చెందిన దళిత నాయకుడు అన్న సంగతి తెలిసిందే.

మాయావతి ఎన్డీయేలో చేరాలి:

మాయావతి ఎన్డీయేలో చేరాలి:

ఎస్పీ-బీఎస్పీ పొత్తు దిశగా జరుగుతున్న ప్రయత్నాలను రాందాస్ అథవాలే తప్పు పట్టారు. ఎస్పీ బీఎస్పీని మోసం చేస్తోందని ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్డీయేలో భాగస్వామిగా మారితే.. ఆమెతో పాటు రామ్ విలాస్ పాశ్వాన్, తానూ కలిసి దళితుల గొంతును మరింత బలంగా వినిపించవచ్చునని అన్నారు.

దళితులపై దాడులు ఆగడం లేదన్నది నిజమేనని, కానీ దానికి ప్రభుత్వం బాధ్యత వహించదని ఆయన పేర్కొనడం గమనార్హం. గోరక్షక దళాల పేరుతో దళితులపై దాడులు జరిగాయని, అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్ దానిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు.

English summary
Central minister Ramdas Athawale, whose RPI faction is part of the ruling NDA, Friday said that the SP-BSP alliance could “cause some damage” and wean away 25-30 seats from the BJP in Uttar Pradesh in the next Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X