సింగర్ బాలు ఆరోగ్యంపై తనయుడు చరణ్ .. సోమవారం శుభవార్త వింటామంటూ
కరోనా వైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తుంది .ఆయన కరోనా నుండి కాస్త కోలుకున్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఆయనకు ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గినట్టుగా తెలుస్తుంది . సినీ పరిశ్రమ వర్గాలు , ఆయన అభిమానులు ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసిన విషయం తెలిసిందే .ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఉన్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు .
బాల సుబ్రహ్మణ్యం కోలుకోవాలని ప్రార్ధనలు చేసిన వారందరికీ ఆయన తనయుడు ఎస్పీ చరణ్ గుడ్ న్యూస్ చెప్పారు . ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలసుబ్రమణ్యం కొద్ది కొద్దిగా కోలుకుంటున్నారు. ఈ విషయంపై ఆయన తనయుడు చరణ్ "నాన్న ఆరోగ్యం వరుసగా నాలుగో రోజు నిలకడగా ఉంది. వచ్చే సోమవారం నాటికి నాన్న ఆరోగ్యం ఈ విషయంలో శుభవార్త వెలువడుతుందని ఆశిస్తున్నాను. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను" అని చరణ్ తాను చేసిన వీడియోలో చెప్పారు.

Recommended Video
మరోవైపు బాలసుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రికి కూడా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది . వైద్య బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆసుపత్రి విడుదలచేసే హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ఆగస్టు 5 నుండి నేటి వరకు ఆసుపత్రిలో కరోనాతో పోరాటం సాగించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం విషమ పరిస్థితి నుండి ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం మరింత మెరుగు పడిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications