బీజేపీ అజేయం ఏమీ కాదు- ఇలా ఓడించొచ్చు-అఖిలేష్ యాదవ్ కొత్త ఫార్ములా ఇదే..
దేశవ్యాప్తంగా మరో 9 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో గెలిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ హ్యాట్రిక్ విజయంతో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. దీన్ని అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం పట్టువిడుపులు ప్రదర్శిస్తూ పాత మిత్రుల్ని, శత్రువుల్ని కూడా కలుపుకుని పోతున్నాయి. ఇదే క్రమంలో ప్రధాన విపక్షం కాంగ్రెస్ తో విభేదిస్తున్న ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెరపైకి కొత్త ఫార్ములా తెచ్చారు.
దేశంలో బీజేపీ అజేయశక్తి ఏమీ కాదని, ఆ పార్టీని ఓడించడానికి ఓ ఫార్ములా ఉందని అఖిలేష్ యాదవ్ ఇవాళ వెల్లడించారు. జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేష్.. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించే శక్తి పీడీఏ కూటమికి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. పీడీఏలో పీ పిఛ్ లే (వెనుకబడిన వర్గాలు), డీ అంటే దళితులు, ఏ అంటే అల్పసంఖ్యాక వర్గాలంటూ అఖిలేష్ తెలిపారు. ఈ ముగ్గురు కలిస్తే బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఉమ్మడి విపక్ష కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఉమ్మడి ప్రతిపక్షం విషయంలో మాత్రం అఖిలేష్ స్పందించలేదు. అయితే ఉత్తరప్రదేశ్ కోసం తన ఏకైక నినాదం మాత్రం "80ని ఓడించండి, బిజెపిని తప్పించడం" అని అఖిలేష్ వెల్లడించారు.
పెద్ద జాతీయ పార్టీలు మాకు మద్దతు ఇస్తే యూపీలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఓడిపోతుంది అని అఖిలేష్ యాదవ్ తెలిపారు. అంటే పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ తన పార్టీ ఎస్పీకి మద్దతిస్తే బీజేపీని యూపీలో ఓడించడం కష్టం కాదనేది ఆయన ఆలోచన. అయితే ఉమ్మడి కూటమి విషయంలో ముందుకు రాని అఖిలేష్ విషయంలో కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications