యూపీలో నేనే రామరాజ్యం తెస్తా.. కలలో శ్రీకృష్ణుడే చెప్పారు.. అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీ తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత హామీలు కుప్పరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రతి రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు కలలోకి వస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. .

కలలో శ్రీకృష్ణుడు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది నేనే..
ఉత్తరప్రదేశ్ లో రామరాజ్యాన్ని నెలకొల్పేందుకు త్వరలోనే నేను ప్రభుత్వాన్ని చేస్తానని శ్రీ కృష్ణుడు తనకు ప్రతిరోజు కలలోకి వచ్చి చెబుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే మాధురి వర్మ ఎస్పీలో చేరిక సందర్భంగా సభలో అఖిలేష్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

రామరాజ్యం తెస్తా..
రామరాజ్యానికి సామ్యవాదమే (సమాజ్‌వాద్) మార్గమన్నారు అఖిలేష్ యాదవ్. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజు రామరాజ్యం ఏర్పడుతుందని చెప్పారు. యూపీలో ఎస్పీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్ని రంగాలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అఖిలేష్ ఆరోపించారు.

.ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్ ఉచితం
కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థుల మాస్ కాపీయింగ్ కు సహకరించినట్లు యూపీలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని మరలా గెలించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ జాతీయ నేతలు ఉత్తరప్రదేశ్‌లో దండెత్తుతున్నారని దుయ్యబట్టారు. ఎస్పీ అధికారంలో వస్తే ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. తన ఉచిత విద్యుత్ వాగ్దానికి బీజేపీ నేతలకు గట్టి షాక్ తగిలిందన్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా బీజేపీ గుణపాఠం తప్పదన్నారు.

క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి సీఎం పదవి..
సమాజ్‌వాదీ పార్టీలో అనేక మంది నేరగాళ్లు, గ్యాంగ్‌స్టర్లు ఉన్నారని బీజేపీ నేతల ఆరోపణలకు అఖిలేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అనేక ఘోరమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని యూపీ ముఖ్యమంత్రిని చేసిన ఘనత బీజేపీదే అని ఆరోపించారు. బీజేపీ తన నేరస్తులు, మాఫియా ప్రక్షాళనకు వాషింగ్ మెషీన్ ని కొనుగోలు చేసిందా ? అని విమర్శించారు.బీజేపీలో చాలా మంది సీనియర్ నాయకులు తమ రక్తం, చెమటతో పార్టీని ఇన్నాళ్లు బలోపేతం చేశారు. పార్టీ కోసం చెమటోడ్చింది తామేనని ఒక్కోసారి చెబుతుంటారు. కానీ ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచో వచ్చి తమపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆపార్టీ నేతలే వాపోతున్నారని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications