అయ్యో ఆజం ఖాన్- విద్వేష వ్యాఖ్యల కేసు నుంచి విముక్తి-అనర్హతతో ఉపఎన్నిక పూర్తి..
2019 నాటి విద్వేష వ్యాఖ్యల కేసులో సమాజ్ వాదీ పార్టీ కీలక నేత ఆజం ఖాన్ కు ఇవాళ విముక్తి లభించింది. ఈ కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడటంతో ఆజం ఖాన్ ఎమ్మెల్యేగా సభ్యత్వం కోల్పోయారు. కానీ ఇవాళ రాంపూర్ లోని ఎమ్మెల్యే, ఎంపీ న్యాయస్ధానం కింది కోర్టు ఆయనకు విధించిన జైలు శిక్షను రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది. అయితే ఇప్పటికే తన నియోజకవర్గంలో ఉపఎన్నిక కూడా పూర్తయి బీజేపీ ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యారు.
2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌ను రాంపూర్ కోర్టు ఇవాళ నిర్దోషిగా ప్రకటించింది. గతేడాది ఈ కేసులో ఆజం ఖాన్ ను దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఫలితంగా ఉప ఎన్నిక జరిగింది. ఇందులో బీజేపీకి చెందిన ఆకాష్ సక్సేనా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు రాంపూర్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అమిత్‌వీర్ సింగ్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు నమోదైన ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఖాన్‌ను దోషిగా నిర్ధారించారు.

2019 ఎన్నికల సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇతరులపై ఆజం ఖాన్ అనుచిత పదజాలం వాడారని అభియోగాలు నమోదు అయ్యాయి. గతేడాది అక్టోబరు 27న అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆయనపై అభియోగాల్ని నిర్ధారించి జైలు శిక్ష విధించారు. దీంతో ఆయన సభ్యత్వం రద్దు చేస్తూ అసెంబ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికైన ఆజం ఖాన్ రాజకీయ జీవితాన్ని ఈ కేసు దాదాపు ముగించింది.
యూపీలో బీజేపీ, ఎస్పీ మధ్య సాగుతున్న పోరులో ఆజం ఖాన్ తన కంచుకోట అయిన రాంపూర్ లో ఎమ్మెల్యేగా గెలిచినా విద్వేష వ్యాఖ్యల కేసులో యోగీ సర్కార్ ఆయన్ను టార్గెట్ చేసి జైలుకు పంపింది. దీంతో పాటు ఎమ్మెల్యేగా కూడా అనర్హత వేటు వేసింది. కానీ ఇప్పుడు కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించినా ఉపఎన్నిక జరిగి ఎమ్మెల్యే కూడా ఎన్నిక కావడంతో అనర్హత వేటును వెనక్కి తీసుకునే అవకాశాలు లేకుండా పోయాయి.












Click it and Unblock the Notifications