పాక్ జిందాబాద్, మోడీ ముర్దాబాద్ అన్న ఎస్పీ నేత

లక్నో: సమాజ్‌వాది పార్టీకి (ఎస్పీ) చెందిన ఓ నేత ఒకరు పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో అతని పైన ఉత్తర ప్రదేశ్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షామిలి జిల్లాలో జరిగింది. సమాజ్ వాది పార్టీకి చెందిన నాయకుడు మహమూద్ అలామ్ జైంఝానా పట్టణ నివాసి.

అతనిని పోలీసులు మీరట్ - కర్నాల్ జాతీయ రహదారి పైన అరెస్టు చేశారు. మీరట్ - కర్నాల్ రహదారిపై వెళుతున్న వారి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఈ నేత మద్యం సేవించి ఉన్నారని పోలీసులు వివరించారు.

SP leader raises pro-Pakistan slogans, arrested

అయితే, తనను అరెస్టు చేయడంపై సదరు నేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడని చెప్పారు. అతని చుట్టు ఆరుగురు పోలీసులు చేరారు. దీంతో రెచ్చిపోయిన అతను ఒక్కసారిగా పాకిస్తాన్ జిందాబాద్.. నరేంద్ర మోడీ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశాడు. దీంతో అతనిపై శాంతిభద్రతల ఉల్లంఘన కేసును నమోదు చేశారు. కాగా, అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+