Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేప్‌లకు పూర్తి బాధ్యత మహిళలదే: ఎస్పీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

హమీర్‌పూర్‌: ఉత్తరప్రదేశ్ అధికార పార్టీ సమాజ్‌వాది పార్టీకి చెందిన మరో నేత మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు మహిళలే కారణమంటూ హమీర్‌పూర్‌ ఎమ్మెల్యే శివచరణ్‌ ప్రజాపతి బుధవారం వ్యాఖ్యానించారు.

‘అత్యాచారాల్లో మహిళలదేమీ తప్పు లేదనడం సరికాదు. రేప్‌లకు పూర్తి బాధ్యత వారిదే' అని చెప్పారు. మహిళలు పాల్గొన్న సమావేశంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అలాగే గర్భస్రావాలు, వరకట్న వేధింపులలోనూ మహిళల పాత్ర తక్కువేమీ కాదని పేర్కొన్నారు. అదే వేదికపై ఉన్న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ జరీనా ఉస్మానీ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

SP MLA blames women for rapes, abortion, dowry harassment

వెంటనే సర్దుకున్న ఎమ్మెల్యే శివచరణ్.. తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు. కాగా, ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసినరోజే రాష్ట్రంలో ముగ్గురు యువతులపై అత్యాచారం జరిగింది. ఎస్పీ ఎమ్మెల్యేపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ప్రజాప్రతి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన నేతలే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేరస్తులను ప్రోత్సహించినట్లవుతుందని బిజెపి అధికారి ప్రతినిధి విజయ్ బహదూర్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+